PM Modi: ఉక్రెయిన్ - రష్యా యుద్ధంపై పీఎం మోదీ కీలక వ్యాఖ్యలు-fully prepared to contribute to ukraine peace process pm modi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Fully Prepared To Contribute To Ukraine Peace Process: Pm Modi

PM Modi: ఉక్రెయిన్ - రష్యా యుద్ధంపై పీఎం మోదీ కీలక వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu
Mar 02, 2023 02:49 PM IST

PM Modi: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రధాని మోదీ
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రధాని మోదీ (Bloomberg)

PM Modi: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆహార కొరత, ఇంధన కొరత, ఎరువుల కొరత తీవ్రమయ్యే ముప్పు ముంచుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Ukraine peace process: భారత్ సిద్ధంగా ఉంది..

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni)తో ప్రధాని మోదీ (PM Modi) గురువారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభ పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా భారత ప్రధాని మోదీని, ఇటలీ ప్రధాని మెలోనీ (Giorgia Meloni) కోరారు. జీ 20 (G20) అధ్యక్ష దేశంగా ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి భారత్ కీలక భూమిక పోషంచాల్సి ఉందన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని నిలిపివేసి, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు అంతర్జాతీయంగా జరిగే ప్రక్రియలో పాలు పంచుకోవడానికి భారత్ (INDIA) సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ (PM Modi) ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి భారత్ ఒకే మాటపై ఉందన్నారు. దౌత్య మార్గాలు ద్వారా, చర్చల ద్వారా మాత్రమే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని, యుద్ధం పరిష్కార మార్గం కాదని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిందని ప్రధాని మోదీ (PM Modi) గుర్తు చేశారు. జీ 20 (G20) విదేశాంగ మంత్రుల సదస్సు ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

WhatsApp channel