EPFO withdrawal norms relaxed: ఈపీఎఫ్ఓ సభ్యులకు శుభవార్త-epfo withdrawal norms for eps 95 subscribers relaxed check details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Epfo Withdrawal Norms Relaxed: ఈపీఎఫ్ఓ సభ్యులకు శుభవార్త

EPFO withdrawal norms relaxed: ఈపీఎఫ్ఓ సభ్యులకు శుభవార్త

HT Telugu Desk HT Telugu
Nov 01, 2022 05:01 PM IST

EPFO withdrawal norms relaxed: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(Employees' Provident Fund Organisation - EPFO) చందాదారులకు శుభవార్త. EPFO ఖాతా నుంచి డబ్బు విత్ డ్రాయల్స్ కు సంబంధించి వెసులుబాటు కల్పిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

EPFO withdrawal norms relaxed: ఈపీఎఫ్ఓ చందాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని EPFO తీసుకుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్-1995((EPS-95) లోని నగదు మొత్తం విత్ డ్రాయల్ కు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది.

EPFO withdrawal norms relaxed: ఆరు నెలల సర్వీస్ ఉండగా..

ఇప్పటివరకు రిటైట్ మెంట్ కు ఆరు నెలల సమయం మాత్రమే ఉన్నవారు తమ ఖాతాలోని నగదును విత్ డ్రా చేసుకునే అవకాశం EPFO చందాదారులకు మాత్రమే ఉండేది. ఇకపై Employees' Pension Scheme 1995 (EPS-95) లో ఉన్న వారు కూడా తమ ఖాతాలోని నగదును మరో ఆరు నెలల సర్వీసు ఉండగానే విత్ డ్రా చేసుకోవచ్చు.

EPFO withdrawal norms relaxed: కేంద్రం నిర్ణయం

EPFO సెంట్రల్ బాడీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (Central Board of Trustees- CBT) 232వ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షత వహించారు. ఆరు నెలల సర్వీస్ ఉండగానే, EPS-95 scheme నుంచి చందాదారులు డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం కలిగించేలా అవసరమైన సవరణలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే, ఈ EPS-95 scheme లో 34 ఏళ్లకు పైగా ఉన్న వారికి ఆ మేరకు పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలని CBT సిఫారసు చేసింది.

Whats_app_banner