రూ. 2.50కే వేడివేడి సమోసాలు.. 'తాతా నువ్వు సూపర్'
ఈ కాలంలో 3 రూపాయలకు ఏం వస్తాయి? అని ఆలోచిస్తే.. చాలా తక్కువ వస్తువులే గుర్తొస్తాయి. ఇదే విషయాన్ని భోజన ప్రియులు ఆలోచిస్తే?.. చాక్లెట్లు తప్ప ఏం రావనే జవాబు లభిస్తుంది. అలాంటిది.. రూ. 2.50కే వేడివేడి సమోసాలు దొరికితే? వినడానికే యమ్మీగా ఉంది కదూ! ఓ వృద్ధుడు రూ. 2.50కే సమోసాలు అమ్ముతున్నాడు.
సమోసాలంటే ఇష్టం లేని వారంటూ బహుశా ఎవరు ఉండకపోవచ్చు! చిన్నదైనా, పెద్దదైనా.. సమోసా క్రేవింగ్స్ వస్తే వెంటనే ఆరగించాల్సిందే. ఒకప్పుడు 5,6 రూపాయలకే పెద్ద సమోసాలు వస్తే.. ఇప్పుడు ఆ ధరకు చిన్నవి కూడా రావడం లేదు. సమోసా ప్రియులకు ఎక్కువ డబ్బులు పెట్టడం తప్పడం లేదు. అయితే పంజాబ్‌లోని ఓ వృద్ధుడు మాత్రం.. తన కొట్టులో సమోసాలను ఇప్పటికీ రూ. 2.50కే అమ్ముతున్నాడు. ఈ వార్త విన్న ప్రజలు వావ్ అంటున్నారు.
అమృత్‌సర్‌లో మహాన సింగ్ రోడ్డులో ఆ 75ఏళ్ల వృద్ధుడికి ఓ చిన్న దుకాణం ఉంది. అందులోనే వేడివేడి సమోసాలు అమ్మతూ జీవితాన్ని సాగిస్తున్నాడు. ఆ సమాసాలు ఎంతో రుచిగా ఉండటంతో అక్కడి స్థానికులు వాటిని ఆరగించేందుకు ఎగబడుతున్నారు. రూ. 2.50కే లభిస్తుండటంతో ఇంకా సంతోషపడిపోతున్నారు.
ఆ వృద్ధుడు సమోసాలు తయారు చేసి అమ్ముతున్న దృశ్యాలను సరబ్జీత్ సింగ్ అనే ఓ ఫుడ్ బ్లాగర్.. వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఫిబ్రవరి 7న పోస్ట్ చేయగా.. ఇప్పటికి ఆ వీడియోకు 8లక్షలకుపైగా వ్యూస్ రావడం విశేషం. నెటిజన్లు సైతం ఆ పోస్ట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'తాతా నువ్వు సూపర్..' అంటూ కామెంట్లు పెడుతున్నారు. 'ఈ కాలంలో కూడా రూ. 2.50కే సమోసాలు అమ్ముతున్నారంటే.. చాలా గొప్ప విషయమే' అంటున్నారు.
సంబంధిత కథనం