DU Recruitment: డీయూలో 111 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు..-delhi university recruitment 111 assistant professor posts in sri aurbindo college on offer ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Delhi University Recruitment 111 Assistant Professor Posts In Sri Aurbindo College On Offer

DU Recruitment: డీయూలో 111 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు..

DU Recruitment: 111 Assistant Professor posts in Sri Aurbindo College on offer
DU Recruitment: 111 Assistant Professor posts in Sri Aurbindo College on offer

ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని శ్రీ అరబిందో కాలేజీలో 111 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడింది.

DU Recruitment: ఢిల్లీ యూనివర్శిటీ(డీయూ) పరిధిలోని శ్రీ అరబిందో కాలేజీ 111 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం నడుస్తోంది. దరఖాస్తుల సమర్పణకు నోటిఫికేషన్ వెలువడిన డిసెంబరు 31, 2022 నుంచి మూడు వారాల గడువు ఉంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రచురితమైంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను అరబిందో వెబ్‌సైట్‌లో సమర్పించవచ్చు. కళాశాల వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

DU Recruitment vacancy details: డీయూ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో భాగంగా 111 అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీలు భర్తీ చేస్తున్నారు.

అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు నింపి సమర్పించవచ్చు.

DU Recruitment: ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అరబిందో కాలేజీ అధికారిక వెబ్‌సైట్ www.aurobindo.du.ac.in సందర్శించాలి. హోం పేజీలో వేకెన్సీ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.

ఆ తరువాత Assistant Professors  వేకేన్సీ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఒక పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ క్లిక్ చేసి దరఖాస్తు ఫారం నింపాలి. తరువాత దరఖాస్తు రుసుము చెల్లించాలి. అడిగిన అన్ని డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారం ప్రింట్ తీసి పెట్టుకోవాలి.

WhatsApp channel

సంబంధిత కథనం