Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్​ 'స్కామ్'​లో బడా నేతల పేర్లను బయటపెట్టిన నిందితుడు!-delhi liquor scam accused sunny marwah questioned by cbi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Delhi Liquor 'Scam': Accused Sunny Marwah Questioned By Cbi

Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్​ 'స్కామ్'​లో బడా నేతల పేర్లను బయటపెట్టిన నిందితుడు!

Sharath Chitturi HT Telugu
Sep 06, 2022 11:13 AM IST

Delhi liquor scam Sunny Marwah : ఢల్లీ లిక్కర్​ స్కామ్​ కేసు విచారణలో భాగంగా.. వేగంగా అడుగులు వేస్తోంది సీబీఐ. తాజాగా ఓ నిందితుడిని విచారించింది. అతను పలు కీలక విషయాలను బయటపెట్టినట్టు తెలుస్తోంది!

లిక్కర్​ స్కామ్​పై ఢిల్లీలో బీజేపీ నిరసనలు
లిక్కర్​ స్కామ్​పై ఢిల్లీలో బీజేపీ నిరసనలు (PTI/file)

Delhi liquor scam Sunny Marwah : ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసు నిందితుడు సన్నీ మర్వాను విచారించిన సీబీఐ.. కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. లిక్కర్​ స్కామ్​కు సంబంధించి.. ఎఫ్​ఐఆర్​లో ఉన్న పలువురిపై సంచలన విషయాలను సన్నీ మర్వా బయటపెట్టినట్టు సమాచారం. ఈ మేరకు సీబీఐ అధికారులు.. సోమవారం సన్నీ మర్వా స్టేట్​మెంట్​ను రికార్డు చేసుకున్నారు.

సన్నీ మర్వా విచారణకు కొన్ని గంటల ముందు.. అతని తండ్రి కుల్విందర్​ మర్వాకు సంబంధించిన ఓ  వీడియోను ‘స్టింగ్​ ఆపరేషన్​’ పేరుతో సోమవారం విడుదల చేసింది బీజేపీ. లిక్కర్​ లైసెన్సుల కోసం కమీషన్లు చెల్లించినట్టు కుల్విందర్​ చెప్పారని బీజేపీ ఆరోపించింది. తాము చేపట్టిన స్టింగ్​ ఆపరేషన్​లో అసలు నిజాలు బయటపడ్డాయని పేర్కొంది.

"లాభాల్లో 80శాతం వాటా సీఎం కేజ్రీవాల్​, డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా, వారి స్నేహితులకు వెళ్లే విధంగా ఒప్పందం జరిగింది. మిగిలిన 20శాతంతో ఏదైనా చేసుకోవచ్చని నేతలు చెప్పారు," అంటూ బీజేపీ ప్రతినిధి సంబిత్​ పాత్రా ఆరోపణలు చేశారు.

Delhi liquor scam news : కాగా.. తండ్రి కుల్విందర్​కు చెందిన వీడియో వ్యవహారం.. సన్నీ మర్వా విచారణలో ప్రస్తావించింది సీబీఐ. ఈ క్రమంలోనే పలు కీలక విషయాలను అతను బయటపెట్టినట్టు తెలుస్తోంది.

సీబీఐ ఎఫ్​ఐఆర్​ ప్రకారం.. ఢిల్లీ కొత్త ఎక్సైజ్​ విధానాల ద్వారా మర్వా మహాదేవ్​ లిక్కర్స్​కు ఎల్​-1 లైసెన్స్​ లభించింది. కాగా.. మర్వాలు ఢిల్లీ ప్రభుత్వ అధికారులకు అత్యంత సన్నిహితులని, వారందరికి వీరు ముడుపులు చెల్లిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. ఇదే కేసులో.. ఇతర నిందితులను కూడా సీబీఐ విచారించింది. వారిలో.. మనీశ్​ సిసోడియకు అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందిన అమిత్​ అరోరా కూడా ఉన్నారు.

సిబీఐ విచారణ, బీజేపీ ఆరోపణలపై మనీశ్​ సిసోడియా స్పందించారు.

Delhi liquor scam Manish Sisodia : "ఎలాంటి స్కామ్​ జరగలేదు. సీబీఐ నన్ను విచారించింది. నా బ్యాంకు లాకర్లను తనిఖీ చేసింది. ఏం లేదని చెప్పి.. నాకు క్లిన్​ చిట్​ ఇచ్చింది," అని మనీశ్​ సిసోడియా అన్నారు.

అయితే.. ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో తాము ఇంకా ఎవరికీ క్లీన్​ చిట్​ ఇవ్వలేదని సీబీఐ చెబుతోంది. దర్యాప్తు వేగంగా జరుగుతోందని, వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెబుతోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం