deepika padukone | దీపిక పదుకోన్ కు అస్వస్థత; హుటాహుటిన ఆసుపత్రికి
ప్రముఖ బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ అస్వస్థతకు లోనయ్యారు. హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్‌లో ఉండగా, ఆమె అస్వస్థతకు లోనయ్యారు. దాంతో, హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారని, తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నారని సమాచారం.
బాలీవుడ్ స్టార్ దీపిక పదుకోన్ మంగళవారం స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ప్రాజెక్ట్ కే` షూటింగ్ కోసం ఆమె హైదరాబాద్ వచ్చారు. షూటింగ్ సెట్‌లోనే ఆమె అస్వస్థతకు లోనయ్యారు.
హుటాహుటిన ఆసుపత్రికి..
చెస్ట్ వద్ద అనీజీగా ఉందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని, హార్ట్ బీట్ కూడా ఎక్కువగా ఉందని దీపిక చెప్పడంతో, ఆమెను హుటాహుటిన షూటింగ్ స్పాట్ నుంచి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటనే వైద్యులు ఆమెకు చికిత్స చేశారు. స్వల్ప చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారు. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం, ఆమె మళ్లీ షూటింగ్ నిమిత్తం సెట్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బావుందని సమాచారం. అయితే, దీపిక అనారోగ్యం గురించి ఆమె టీమ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కచ్చితంగా ఏ సమస్యతో ఆమె ఆసుపత్రికి వెళ్లారన్న విషయంపై కూడా క్లారిటీ లేదు.
ప్రభాస్ హీరో..
ప్రస్తుతం దీపిక పదుకోన్ `ప్రాజెక్ట్ కే` షూటింగ్‌లో ఉన్నారు. ఈ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి దిశాపటానీ కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. `ప్రాజెక్ట్ కే` కాకుండా షారూఖ్ ఖాన్ మూవీ `పఠాన్`లో, హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న `ఫైటర్` సినిమాల్లోనూ దీపిక పదుకోన్ ప్రధాన కథానాయికగా నటిస్తున్నారు.
టాపిక్