Dawood Ibrahim : అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకున్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్!
Dawood Ibrahim second marriage : మొదటి భార్యతో విడాకులు తీసుకున్నానని అబద్ధం చెప్పి.. దావూద్ ఇబ్రహీం రెండో పెళ్లి చేసుకున్నాడు! ఈ విషయాన్ని అతని మేనల్లుడు అలీషాహ్.. ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు.
Dawood Ibrahim second marriage : అండర్‌వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు అతని మేనల్లుడు అలీషాహ్ పార్కర్. మొదటి భార్య మైజాబిన్ ఉండగానే.. మరో మహిళను దావూద్ పెళ్లిచేసుకున్నట్టు పేర్కొన్నాడు. ఆ మహిళ ఓ పాకిస్థానీ పఠాన్ కుటుంబానికి చెందినదిగా వివరించాడు.
అబద్ధం చెప్పి.. రెండో పెళ్లి..!
టెర్రర్ ఫండింగ్ కేసులో భాగంగా దావూద్ ఇబ్రహీంపై గతంలో కేసు నమోదు చేసింది ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ). ఈ క్రమంలో దావూద్‌తో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్ చేసింది. వీరిలో దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషాహ్ పార్కర్ కూడా ఉన్నాడు. విచారణలో భాగంగా.. అలీషాహ్ స్టేట్మెంట్ను తీసుకున్న అధికారులు.. టెర్రర్ ఫండింగ్ కేసులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.
Underworld don Dawood Ibrahim : విచారణలో.. దావూద్ ఇబ్రహీంపై పలు కీలక విషయాలను బయటపెట్టాడు అలీషాహ్ పార్కర్. దావూద్ ఇబ్రహీం కుటుంబం గురించి చెప్పాడు. అదే సమయంలో.. పాకిస్థాన్ కరాచీలోని ఒక ప్రాంతానికి దావూద్ ఇబ్రహీం రీలొకేట్ అయినట్టు వివరించాడు.
అలీషాహ్ పార్కర్ ప్రకారం.. దావూద్‌కు నలుగురు సోదరులు, నలుగురు సోదరీమణులు ఉన్నారు. మొదటి వివాహం విషయంలో అబద్ధం చెప్పి.. అతను రెండో పెళ్లి చేసుకున్నాడు.
Dawood Ibrahim Alishah Parkar : "మొదటి భార్యతో విడాకులు తీసుకున్నట్టు దావూద్ ఇబ్రహీం అందరికి చెప్పాడు. కానీ అది నిజం కాదు. మొదటి భార్యతో ఉండగానే.. అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. అదే సమయంలో దావూద్ ఇబ్రహీం తన ఇంటిని కూడా మార్చుకున్నాడు. ఇప్పుడు అతను కరాచీ అబ్దుల్లా ఘాజి బాబా దర్గాకు సమీపంలోని రహీమ్ ఫకీ అనే డిఫెన్స్ ప్రాంతంలో నివాసముంటున్నాడు," అని అధికారులకు వివరించాడు అలీషాహ్ పార్కర్. అయితే.. దావూద్ ఇబ్రహీం ఎవరితోనూ మాట్లాడట్లేదని, అందరికీ దూరంగా ఉంటున్నాడని తెలిపాడు.
వాట్సాప్ కాల్స్‌లో..
"నేను 2022లో దుబాయ్‌కి వెళ్లాను. జులైలో అక్కడ దావూద్ మొదటి భార్యను కలిశాము. నా భార్యకు ఆమె పండుగల సమయంలో ఫోన్లు చేస్తుంది. వాట్సాప్ కాల్స్‌లో వాళిద్దరు తరచూ మాట్లాడుకుంటారు," అని చెప్పాడు దావూద్ మేనల్లుడు.
Alishah Parkar NIA chargesheet : అలీషాహ్ పార్కర్ ప్రకారం.. మొదటి భార్యతో దావూద్ ఇబ్రహీంకి ముగ్గురు ఆడబిడ్డలు, ఒక కుమారుడు ఉన్నారు. వారు.. మరూఖ్, మెహ్రిన్, మజియా, మోహిన్ నవాజ్.
భారీ పేలుళ్లకు కుట్ర..!
నిఘా వర్గాల వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం ఓ పెద్ద టీమ్‌ను తయారు చేస్తున్నాడు. దేశంలోని అగ్రనేతలు, బడా వ్యాపారవేత్తలే లక్ష్యంగా ఈ బృందం దాడులు చేసే అవకాశం ఉంది. ప్రముఖ నగరాల్లో హింసకు పాల్పడి.. అలజడులు సృష్టించే ప్రమాదం ఉంది.
సంబంధిత కథనం