CSIR UGC NET 2023: సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ దరఖాస్తుకు గడువు పొడగింపు-csir ugc net 2023 registration deadline extended till april 17 details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Csir Ugc Net 2023: సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ దరఖాస్తుకు గడువు పొడగింపు

CSIR UGC NET 2023: సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ దరఖాస్తుకు గడువు పొడగింపు

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 07:00 PM IST

CSIR UGC NET 2023: సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ (CSIR UGC NET) పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగిస్తున్నట్లు ఎన్టీఏ (NTA) ప్రకటించింది. దాంతో, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు తమ అప్లికేషన్ ను సమర్పించడానికి ఏప్రిల్ 17 వరకు సమయం లభించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

CSIR UGC NET 2023: సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ (CSIR UGC NET) పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగిస్తున్నట్లు ఎన్టీఏ (NTA) ప్రకటించింది. దాంతో, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు తమ అప్లికేషన్ ను సమర్పించడానికి ఏప్రిల్ 17 వరకు సమయం లభించింది.

CSIR UGC NET 2023:ఆన్ లైన్ లో దరఖాస్తు

సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2023 (CSIR UGC NET) పరీక్షకు విద్యార్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవల్సి ఉంటుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును ఏప్రిల్ 10వ తేదీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్స్ (National Testing Agency, NTA) ఏప్రిల్ 17 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 17 వరకు csirnet.nta.nic.in. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ (CSIR UGC NET) పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 10వ తేదీన ప్రారంభమైంది. అప్లై చేసిన తరువాత, తప్పొప్పులను సరి చేసుకోవడానికి వీలుగా కరెక్షన్ విండ్ csirnet.nta.nic.in. వెబ్ సైట్ లో ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 25 వరకు అందుబాటులో ఉంటుంది.

CSIR UGC NET 2023: ఎగ్జామ్ డేట్ సేమ్..

సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ (CSIR UGC NET) పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును మాత్రమే పొడిగించామని, సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ (CSIR UGC NET) పరీక్ష మాత్రం గతంలో ప్రకటించిన తేదీ రోజే ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్స్ (National Testing Agency, NTA) స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన విధంగానే, సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ (CSIR UGC NET) పరీక్ష జూన్ 6వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు జరుగుతుందని తెలిపింది.

Steps to to apply: అప్లై చేసుకోండిలా..

  • ముందుగా యూజీసీ నెట్ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.nic.in.ను కానీ, లేదా, csirnet.nta.nic.in. వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో కనిపించే CSIR UGC NET Exam లింక్ పై క్లిక్ చేయాలి.
  • స్క్రీన్ పై కనిపించే అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
  • అన్ని వివరాలు ఒకసారి సరి చూసుకుని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఒక సాఫ్ట్ కాపీని, ప్రింట్ తీసుకుని ఒక హార్డ్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం భద్రపర్చుకోవాలి.
  • అదనపు వివరాల కోసం విద్యార్థులు csirnet.nta.nic.in, లేదా nta.ac.in వెబ్ సైట్స్ ను సందర్శించవచ్చు. Notification here

Whats_app_banner

టాపిక్