Suresh Raina : సురేశ్​ రైనా బంధువుల మర్డర్​ కేసు నిందితుడి ఎన్​కౌంటర్​!-criminal wanted in murders of suresh raina s relatives killed in up police encounter ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Criminal Wanted In Murders Of Suresh Raina's Relatives Killed In Up Police Encounter

Suresh Raina : సురేశ్​ రైనా బంధువుల మర్డర్​ కేసు నిందితుడి ఎన్​కౌంటర్​!

Sharath Chitturi HT Telugu
Apr 02, 2023 09:16 AM IST

Suresh Raina news : 2020 సురేశ్​ రైనా బంధువుల హత్య కేసు నిందితుడిని ఉత్తర్​ ప్రదేశ్​ పోలీసులు ఎన్​కౌంటర్​ చేశారు. అతను వాంటెడ్​ క్రిమినల్​ రషీద్​ అని పోలీసులు వివరించారు.

సురేశ్​ రైనా బంధువుల మర్డర్​ కేసు నిందితుడు హతం!
సురేశ్​ రైనా బంధువుల మర్డర్​ కేసు నిందితుడు హతం! (File)

Suresh Raina news : టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనా బందువుల హత్య కేసులో నిందితుడు, వాంటెడ్​ క్రిమినల్​ రషీద్​ను.. ఉత్తర్​ ప్రదేశ్​ పోలీసులు ఎన్​కౌంటర్​ చేశారు. షాహ్​పూర్​ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ ఎన్​కౌంటర్​ జరిగినట్టు అధికారులు వివరించారు.

2020లో ఏం జరిగింది..?

 సురేశ్​ రైనా బంధువులు పతాన్​కోట్​లోని థర్యాల్​ గ్రామంలో నివాసముండేవారు. రైనా మామ అశోక్​ కుమార్​ ఓ కాంట్రాక్టర్​. అతని భార్య పేరు ఆషా రాణి, కొడుకు పేరు కౌషల్​.

Suresh Raina relatives murder : 2020 ఆగస్టు 19 అర్ధరాత్రి వేళ.. వేరువేరు ప్రాంతాల నుంచి 2,3 బృందాలు థర్యాల్​పై దాడి చేశాయి. అర్ధరాత్రి వేళ ఇళ్లల్లోకి ప్రవేశించి దోపిడీ చేయడం, అడ్డొచ్చిన వారిని హత్య చేయడం ఈ బృందాలకు అలవాటు. వీరిపై అనేక ప్రాంతాల్లో ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ రాత్రి.. తొలుత 2 ఇళ్లపై దాడి చేసినా ఫలితం దక్కలేదు. మూడోసారి.. అశోక్​ కుమార్​ ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. నిచ్చెన సాయంతో ఐదుగురు లోపలికి వెళ్లారు. సురేశ్​ రైనా బంధువులు నేలపై పడుకుని ఉండటాన్ని చూశారు. నిందితులు.. బాధితుల తలపై గట్టిగా కొట్టారు. అనంతరం వివిధ గదుల్లోకి వెళ్లి నగదు, బంగారాన్ని దోచుకుని, అక్కడి నుంచి తప్పించుకున్నారు. అశోక్​ కుమార్​ అక్కడిక్కడ చనిపోయారు. కౌషల్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అషా రాణితో పాటు మరో ఇద్దరు.. గాయాలతో బయటపడ్డారు.

సురేశ్​ రైనా బంధువులు కావడంతో ఈ ఘటన మరుసటి రోజు ఉదయమే వార్తలకెక్కింది. చివరికి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Criminal Rashid encounter : ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ బృందాలు రషీద్​ అలియాస్​ చల్తా ఫిర్తా అలియాస్​ సిపాహియా అనే కరుడుగట్టిన దొంగ, నేరస్తుడికి చెందినదని గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటవరకు ఘటనకు సంబంధించిన ఐదుగురిని అరెస్ట్​ చేశారు. చివరికి రషీద్​ను ఎన్​కౌంటర్​ చేశారు.

ఎన్​కౌంటర్​ జరిగింది ఇలా..

రషీద్​పై 10కిపైగా దోపిడీ, హత్య కేసులు ఉన్నాయి. అతని తలపై రూ.50వేల రివార్డు కూడా ఉంది. అతడిని పట్టుకునేందుకు పోలీసులు చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాగా.. షాహ్​పూర్​ పోలీస్​ స్టేషన్​ పరిథిలోని ఓ ప్రాంతంలో రషీద్​ బృందం ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. శనివారం అతడిని పట్టుకునేందుకు వెళ్లారు. పోలీసులను చూసిన రషీద్​ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు.

Suresh Rain relatives death : బైక్​పై నుంచి పోలీసులపై కాల్పులు జరిపాడు రషీద్​. ప్రతిఘటించిన పోలీసులు.. రషీద్​తో పాటు బైక్​ నడుపుతున్న మరో వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ ఎన్​కౌంటర్​లో రషీద్​ మరణించాడు. ఘటనాస్థలం నుంచి రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం