Congress protests: ఆదానీ హిండెన్ బర్గ్ ఇష్యూ పై మార్చి 6 నుంచి కాంగ్రెస్ నిరసనలు
Congress protests: ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ ఆర్థిక అవకతవకలకు (adani-hindenburg row) సంబంధించి అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ బహిరంగపర్చిన నివేదిక సంచలనం సృష్టించింది.
Adani-hindenburg row: ఆదానీ గ్రూప్ కంపెనీల ఆర్థిక అవకతవకలపై హిండెన్ బర్గ్ (adani-hindenburg row) నివేదిక బహిర్గతమైననాటి నుంచి ఆయా కంపెనీల షేర్లు కుప్పకూలడం ప్రారంభమైంది. ఆ కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు.
Congress protests on Adani issue: ఎల్ఐసీకి భారీ నష్టాలు
సాధారణ ఇన్వెస్టర్లే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ (LIC) కూడా ఆదానీ గ్రూప్ లో భారీగా పెట్టుబడులు పెట్టింది. తాజా ఆదానీ హిండెన్ బర్గ్ (adani-hindenburg row) వ్యవహారంతో ఎల్ఐసీ (LIC) భారీగా నష్టపోయింది. ఆదానీ, ప్రధాని మోదీకి సన్నిహితుడని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రధాని మోదీ, బీజేపీ సహకారంతోనే ఆదానీ ఆర్థిక అవకతవకలకు పాల్పడగలిగాడని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఆదానీ, హిండెన్ బర్గ్ వ్యవహారంలో (adani-hindenburg row) ప్రధాని మోదీ (PM Modi), బీజేపీ పాత్రలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా తాలుకా స్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. మార్చి 6 నుంచి ఈ నిరసన ప్రదర్శనలు ప్రారంభమవుతాయని ప్రకటించింది.
PARDAFASH rallies: దేశవ్యాప్త ర్యాలీలు
ఆదానీ (Goutham Adani), ప్రధాని మోదీ (PM Modi), బీజేపీల మోసపూరిత సాన్నిహిత్యం దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆదానీ, హిండెన్ బర్గ్ వ్యవహారంపై మార్చి, ఏప్రిల్ నెలల్లో 'PARDAFASH' ర్యాలీలను నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాలు, తాలూకా కేంద్రాల్లో ఈ నిరసనలు కొనసాగుతాయన్నారు. నిరసనల్లో భాగంగా మార్చి 6 నుంచి మార్చి 10 మధ్య జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు ప్రెస్ మీట్స్ నిర్వహిస్తారని, తాలుకా స్థాయిలో బ్యాంకులు, ఎల్ఐసీ (LIC) ఆఫీసుల ముందు కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేస్తారని వేణుగోపాల్ వివరించారు. అలాగే, మార్చి 13న రాష్ట్రాల రాజధానుల్లో భారీ ‘చలో రాజ్ భవన్’ ర్యాలీ ఉంటుందని వివరించారు. పార్టీ సీనియర్ నేతలు, పార్టీకి చెందిన అన్ని విభాగాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ నిరసనల్లో పాల్గొంటారని తెలిపారు.