Agniveer incentives | `అగ్నివీర్`లకు మరిన్ని తాయిలాలు
సాయుధ దళాల్లో ప్రవేశం కోసం ప్రారంభించిన కొత్త రిక్రూట్‌మెంట్ స్కీం `అగ్నిపథ్`కు నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం, వారి ఆందోళనలు దేశవ్యాప్తంగా హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
ఇవీ స్థూలంగా `అగ్నివీర్`లకు కేంద్రం అందిస్తున్న సదుపాయాలు..
- రక్షణ రంగ ఉద్యోగాల్లో `అగ్నివీర్`లకు 10% రిజర్వేషన్లు. కోస్ట్‌గార్డ్స్, రక్షణ రంగానికి చెందిన 16 పీఎస్‌యూల్లో, సివిలియన్ పోస్ట్‌ల్లో ఈ రిజర్వేషన్లు వర్తింపు.
- మొదటి సంవత్సరం రెండేళ్ల పాటు గరిష్ట వయోపరిమితి పెంపు. అంటే, మొదటి సంవత్సరం `అగ్నిపథ్`లో చేరేవారికి 25 ఏళ్ల వయస్సు వరకు అనుమతి ఉంటుంది. మొదట, 21 ఏళ్లు ఉన్న గరిష్ట వయోపరిమితిని ఉద్యోగార్థుల ఆందోళనల నేపథ్యంలో 23కి పెంచారు. ఇప్పుడు మొదటి సంవత్సరం మాత్రం మరో 2 ఏళ్లు పెంచారు.
- సీఏపీఎఫ్‌ల్లో, అస్సాం రైఫిల్స్‌లో `అగ్నివీర్`లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర హోం శాఖ.
- రాష్ట్రాల పోలీస్ రిక్రూట్‌మెంట్లలో `అగ్నివీర్`లకు ప్రత్యేక ప్రాధాన్యత
- సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్‌ల్లో `అగ్నివీర్`లకు గరిష్ట వయోపరిమితి మూడేళ్లు పెంపు.
- మర్చంట్ నేవీలో `అగ్నివీర్`లకు ప్రత్యేక ఉద్యోగ అవకాశాలు. భారతీయ నౌకాదళ ఆరు సేవాకేంద్రాల్లో వీరిని చేర్చుకునేందుకు ఆమోదం.
- 10వ తరగతి పాస్ అయిన తరువాత, అగ్నిపథ్‌లో చేరిన వారికి దూర విద్య ద్వారా 12వ తరగతి చదివే అవకాశం. ఇందుకుగానూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఒక విద్యా కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది.
- డిగ్రీ చేస్తున్న `అగ్నివీర్`లకు విద్యాశాఖ ప్రత్యేక క్రెడిట్స్ ఇస్తుంది.
- `అగ్నివీర్`ల కోసం ప్రత్యేకంగా `ఇగ్నో`నుంచి డిగ్రీ కోర్సుల ఏర్పాటు
- `అగ్నివీర్`లకు స్కిల్ ఇండియా సర్టిఫికేషన్.
- అవసరమైన రుణాలు ఇవ్వడం ద్వారా ఉపాధి పొందేందుకు `అగ్నివీర్`లకు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల సహకారం.
- సాయుధ దళాల్లో సర్వీస్ పూర్తి అయిన తరువాత తమ సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వడానికి కార్పొరేట్ సంస్థలు సిద్ధం.
టాపిక్