అదానీ విల్మర్.. ఫుడ్ కంపెనీల్లో అద్భుతమైన రాణింపు-billionaire adanis food venture is best performing asia ipo ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  అదానీ విల్మర్.. ఫుడ్ కంపెనీల్లో అద్భుతమైన రాణింపు

అదానీ విల్మర్.. ఫుడ్ కంపెనీల్లో అద్భుతమైన రాణింపు

HT Telugu Desk HT Telugu
May 26, 2022 01:40 PM IST

మార్కెట్లో కొత్తగా లిస్టయిన అదానీ విల్మర్ లిమిటెడ్.. లిస్టయినప్పటి నుంచి ఇప్పటివరకు మూడింతలు పెరిగింది. కానీ ఇటీవల లిస్టయిన అనేక కంపెనీలు మాత్రం నష్టాలు చవిచూశాయి.

ఫార్చూన్ బ్రాండ్‌తో ఫుడ్ బిజినెస్‌లో ఉన్న అదానీ విల్మార్
ఫార్చూన్ బ్రాండ్‌తో ఫుడ్ బిజినెస్‌లో ఉన్న అదానీ విల్మార్ (adaniwilmar)

ఏషియాలోనే ధనవంతుడైన గౌతమ్ అదానీ, సింగపూర్‌కు చెందిన విల్మర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ సంస్థల జాయింట్ వెంచర్‌గా అదానీ విల్మర్ ఏర్పడింది. ఏషియాలో వివిధ మార్కెట్లలో లిస్టయిన 121 ఐపీఓల కంటే మెరుగ్గా రాణించింది. దాదాపు ప్రతి మూడు ఐపీఓల్లో రెండు నెగెటివ్‌గా ట్రేడవుతున్నాయి. అటు వడ్డీ రేట్ల పెంపు, ఉక్రెయిన్లో యుద్ధం తదితర కారణాల వల్ల అనేక స్టాక్స్ నెగెటివ్‌లో ట్రేడవుతున్నాయి.

అదానీ విల్మర్ ఐపీవోలో సింగపూర్ మానిటరీ అథారిటీ, నిప్పాన్ లైఫ్ ఇండియా తదితర సంస్థలు పెట్టుబడిదారులుగా ఉన్నాయి. ఈ కంపెనీ ఫార్చూన్ బ్రాండ్ పేరుతో వంట నూనెలు, గోధుమ పిండి, బియ్యం, పప్పులు, చక్కెర, ఇతర ఆహార పదార్థాల తయారీలో నిమగ్నమై ఉంది. ఐపీవో ద్వారా జమైన 486 మిలియన్ డాలర్లలో కొంత భాగం తన వసతులను విస్తరించుకోవడానికి, రుణ చెల్లింపులకు, వ్యూహాత్మక సమీకరణలకు వెచ్చించనున్నట్టు అదానీ విల్మర్ గతంలో వెల్లడించింది.

‘పటిష్టమైన పంపిణీ నెట్ వర్క్ కలిగిన ఈ కంపెనీ.. మార్కెట్లో తన వాటాను పెంచుకోవాలని యత్నిస్తోంది. విభిన్న ఉత్పత్తుల పోర్టుఫోలియోతో మదుపరులను ఆకర్షిస్తోంది. ముఖ్యమైన విభాగాల్లో మార్కెట్లో మంచి వాటా కలిగి ఉంది. గ్రామీణ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తోంది..’ అని కేఆర్ చోక్సీ కంపెనీ అనలిస్ట్ విక్రాంత్ కశ్యప్ అన్నారు.

ఈ బలమైన పనితీరు అదానీకి కలిసొస్తుంది. ఏషియాలోనే ఒప్పందాల్లో అత్యంత బిజీగా ఉండే వ్యాపారవేత్త తన పరిధిని బొగ్గు, మౌలిక వసతుల స్థాపన తదితర రంగాల నుంచి విస్తరిస్తున్నారు. వైవిధ్యత కోసం డేటా సెంటర్లు, డిజిటల్ సర్వీసులు వంటి రంగాల్లోకి వస్తున్నారు. దాదాపు 32 సంస్థలను గత ఏడాదిలో కొనుగోలు చేశారు.

ఈ జాయింట్ వెంచర్ ఐపీఓ ద్వారా సేకరించిన నిధులతో రుణాలు తీర్చేసింది. ఆయా మాతృకంపెనీల నుంచి గణనీయమైన ప్రయోజనం పొందాయని కశ్యప్ గత నెలలో తన నోట్‌లో వివరించారు. ఈ స్టాక్‌ను పెంచు(అక్యుములేట్)కోవచ్చని సిఫారసు చేశారు. మరిన్ని సంస్థల టేకోవర్ ఒప్పందాలు.. ఈ కంపెనీ తన మార్కెట్ వాటా విస్తరించుకోవడానికి దోహదం చేస్తాయని చెప్పారు. కోహినూర్ కుకింగ్ బ్రాండ్ సహా పలు సంస్థలను కొనుగోలు చేసుకోనున్నట్టు అదానీ విల్మార్ వెల్లడించింది.

అదానీకి సంబంధించిన ఇతర స్టాక్స్ కూడా మంచి పనితీరును కనబరుస్తున్నాయని కశ్యప్ తెలిపారు. అదానీ పవర్ ఈ ఏడాది దాదాపు 200 శాతానికి పైగా పెరిగిందని, సెన్సెక్స్‌లో ఇది టాప్ పర్ఫార్మర్‌గా నిలిచిందని వివరించారు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏడాది కాలంలో 65 శాతం ఎగబాకిందని వివరించారు.

IPL_Entry_Point

టాపిక్