B’luru airport saw 1.6 passengers: బెంగళూరు ఏర్ పోర్ట్ కు 1.6 కోట్ల ప్రయాణీకులు
B’luru airport saw 1.6 passengers: గత ఆరు నెలల్లో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1.675 కోట్లమంది ప్రయాణించారు. భారత్ లో అత్యంత రద్దీ అయిన విమానాశ్రయాల్లో ఒకటిగా బెంగళూరు ఏర్ పోర్ట్ నిలిచింది.
B’luru airport saw 1.6 passengers: ఈ సంవత్సరం ఏప్రిల్, అక్టోబర్ నెలల మధ్య బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1.675 కోట్ల మంది ప్రయాణించినట్లు ఆ విమానాశ్రయ నిర్వహణ సంస్థ వెల్లడించింది.
B’luru airport saw 1.6 passengers: టెక్ రాజధాని
దేశ టెక్నాలజీ రాజధానిగా బెంగళూరుకు పేరు. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థల ప్రధాన కార్యాలయాలు, లేదా ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి. దాంతో, ఇక్కడి నుంచి రోజూ వేల సంఖ్యలో విమాన యానం చేస్తుంటారు.
B’luru airport saw 1.6 passengers: దేశీయంగా 1.5 కోట్లు..
ఈఏర్పోర్ట్ మేనేజ్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం ఈ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 21 లక్షల మంది విదేశీ ప్రయాణాలు, 1.475 కోట్ల మంది దేశీయ ప్రయాణాలు చేశారు. అక్టోబర్ 9న ఒక్కరోజే ఈ విమానాశ్రయం నుంచి 97,040 మంది ప్రయాణించారు. గత ఆర్నెళ్లలో అదే అత్యంత రద్దీగా ఉన్న రోజుగా గుర్తించారు.
B’luru airport saw 1.6 passengers: బెంగళూరు నుంచి ఢిల్లీకే ఎక్కువ..
దేశీయ ప్రయాణాల్లో బెంగళూరు నుంచి ఢిల్లీకి ఎక్కువ ప్రయాణాలు జరిగాయి. ఆ తరువాత ముంబై, కోల్ కతా, కొచ్చి, పుణెలకు జరిగాయి. అంతర్జాతీయ ప్రయాణాల్లో అత్యధికం దుబాయికి, ఆ తరువాత దోహ, సింగపూర్, ఫ్రాంక్ ఫర్ట్, బ్యాంకాక్ లకు జరిగాయి. నవంబర్ 10న ప్రారంభమవుతున్న కొత్త టర్మినల్ వార్షికంగా 2.5 కోట్ల మందికి సేవలను అందించగలదని భావిస్తున్నారు. ఈ టర్మినల్ ను, ఏర్ పోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తైన కెంపెగౌడ విగ్రహాన్ని నవంబర్ 10 ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు.
టాపిక్