TMC minister remarks on Prez: రాష్ట్రపతిపై బెంగాల్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు-bengal minister akhil giri draws criticism for remark on prez apologises ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Tmc Minister Remarks On Prez: రాష్ట్రపతిపై బెంగాల్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు

TMC minister remarks on Prez: రాష్ట్రపతిపై బెంగాల్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu
Nov 12, 2022 07:22 PM IST

TMC minister remarks on Prez: పశ్చిమ బెంగాల్ లోని టీఎంసీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి ఒకరు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానిస్తూ అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమబెంగాల్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అఖిల్ గిరి
పశ్చిమబెంగాల్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అఖిల్ గిరి

TMC minister remarks on Prez: పశ్చిమబెంగాల్ లోని మమత బెనర్జీ ప్రభుత్వంలో అఖిల్ గిరి సీనియర్ మంత్రి. ఆయన శుక్రవారం నందిగ్రామ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు.

TMC minister remarks on Prez: సుదేంధు అధికారి వల్ల..

నంది గ్రామ్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి అఖిల్ గిరి మాట్లాడుతూ.. ‘నేను అందంగా లేను అని బీజేపీ నేత సుదేంధు అధికారి అంటున్నారు. ఆయన మాత్రం ఏం అందంగా ఉన్నారు. ఆ మాటకొస్తే, మన రాష్ట్రపతి ఎలా ఉంటారు? మనం రాష్ట్రపతి పదవిని గౌరవిస్తాం. కానీ, మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?’ అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

TMC minister remarks on Prez: బీజేపీ ఫైర్

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానిస్తూ టీఎంసీ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆ వ్యాఖ్యలతో భారతీయులందరినీ మంత్రి అఖిల్ గిరి అవమానించారని బీజేపీ నేత అర్జున్ ముండా విమర్శించారు. గిరిజనులకు మమత బెనర్జీ, టీఎంసీ వ్యతిరేకమని మరోసారి రుజువైందన్నారు. తక్షణమే అఖిల్ గిరిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, అఖిల్ గిరి కామంట్లపై జాతీయ మహిళా కమిషన్ కు బీజేపీ ఫిర్యాదు చేసింది.

TMC minister remarks on Prez: మాకు సంబంధం లేదు

రాష్ట్రపతిని అవమానిస్తూ తమ మంత్రి చేసిన వ్యాఖ్యలతో టీఎంసీకి కానీ, ప్రభుత్వానికి కానీ ఏ విధమైన సంబంధం లేదని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమని, అభ్యంతరకరమని, అలాంటి మహిళా వ్యతిరేక వ్యాఖ్యలను పార్టీ ఆమోదించబోదని స్పష్టం చేసింది.

TMC minister remarks on Prez: మంత్రి క్షమాపణ

రాష్ట్రపతిని అగౌరవపరిచే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని మంత్రి అఖిల్ గిరి తెలిపారు. తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని, క్షమాపణలు తెలుపుకుంటున్నానని ప్రకటించారు. ‘‘బీజేపీ నేత సుదేంధు అధికారి నేను అందంగా ఉండనంటూ కొన్ని రోజులుగా నన్ను అవమానిస్తూ మాట్లాడుతున్నారు. ఆ కోపంతో, అతడిని లక్ష్యంగా చేసుకుని విచక్షణ కోల్పోయి అలా మాట్లాడాను. నాకు రాజ్యాంగం పట్ల, రాష్ట్రపతి పట్ల గొప్ప గౌరవం ఉంది. నేను వృద్ధుడిని. పొరపాటున, ఆవేశంలో అలా మాట్లాడాను. అందుకు ఇప్పుడు చింతిస్తున్నాను’ అని ఆయన వివరించారు.

Whats_app_banner