Ayodhya Ram Mandir : 11 రోజుల పాటు ప్రధాని మోదీ ఉపవాసం..!
Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని అత్యంత పవిత్రంగా పరిగణిస్తున్నారు ప్రధాని మోదీ. బిజీ షెడ్యూల్లోను అన్ని ఆచారాలను పాటించేందుకు ప్రయత్నిస్తున్నారు.
PM Modi on Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా.. వీలు కుదిరినప్పుడల్లా అన్ని పనులపై ఆరా తీస్తున్నారు. అయితే.. రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని పలు ఆచారాలాను, నియమాలను పాటించనున్నట్టు తెలుస్తోంది.
11 రోజుల పాటు ఉపవాసం..
రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు పాటించాల్సిన ఆచారాల గురించి ప్రధాని ఇప్పుటికే తెలుసుకున్నారని సమాచారం. ఈ మేరకు 11 రోజుల పాటు ఉపవాసంలో ఉంటారని తెలుస్తోంది. గ్రంథాల్లో చెప్పిన అన్ని నియమాలను పాటించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారట. బ్రహ్మముహూర్తంలో జాగారం చేస్తారని సమాచారం. అంతేకాకుండా.. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా.. మహారాష్ట్ర నాసిక్‌లోని పంచవటిని సందర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారట. 14ఏళ్ల వనవాసంలో చాలా సమయం శ్రీరాముడు అక్కడే గడిపాడు.
Ayodhya Ram Mandir latest news : రామ మందిర ప్రారంభోత్సవానికి ముందుకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు ప్రధాని మోదీ.
"ఇలాంటి భావాలను నేను ఎప్పుడు అనుభూతి చెందలేదు. ఇలాంటి పవిత్రమైన రోజును చూడటం నా అదృష్టం. ప్రాణప్రతిష్ఠ సమయంలో భారత ప్రజలకు ప్రాథినిథ్యం వహించేందుకు, భగవంతుడు నన్ను ఎంపిక చేశాడు. ఈ ఘట్టం కోసం వేలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు," అని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ.
అన్ని కార్యక్రమాలు.. ఆచారాలను పాటిస్తూనే..
"ఆలయంలో దేవుడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ, ముడుపు కట్టడంతో పాటు ఆ రోజుకు కొన్ని రోజుల ముందు నుంచే కొన్ని ఆచారాలను పాటించాల్సి ఉంటుంది. మోదీ.. రామ భక్తుడు. ఆధ్యాత్మిక మార్గంలో ఆలయాన్ని నిర్మించి, ప్రారంభించేందుకు ప్రధాని కట్టుబడి ఉన్నారు," అని రామ మందిర నిర్మాణానికి సంబంధించిన వర్గాలు వెల్లడించాయి.
PM Modi latest news : "ప్రాణప్రతిష్ఠకు ముందు 11 రోజుల పాటు చేయాల్సిన యమ-నియం ఆచారాన్ని ప్రధాని మొదలుపెట్టారు. బ్రహ్మముహూర్త జాగారం, సాధన, సాత్విక వంటలు తినండం వంటి ఆచారాలను మోదీ చేస్తున్నారు. 11 రోజుల పాటు ఉపవాసం కూడా ఉంటున్నారు," అని మరో అధికారి వివరించారు.
అంగరంగ వైభవంగా..
PM Modi Ayodhya Ram Mandir : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.
సంబంధిత కథనం