Assam crime news : విద్యార్థినిని అసభ్యకరంగా ముట్టుకుంటూ.. ఆ వీడియోలు చూపించిన టీచర్- తగలబడిన స్కూల్!
Assam crime news : అసోంలో ఓ టీచర్, ఓ విద్యార్థినిని అసభ్యకరంగా ముట్టుకుంటూ, పోర్న్ వీడియో చూపించాడు. ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు స్కూల్‌ని తగలబెట్టారు. నిందితుడు తప్పించుకుని పారిపోయాడు.
అసోంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. ఓ విద్యార్థినికి పోర్న్ వీడియోలు చూపించాడు. అసభ్యకరంగా ముట్టుకున్నాడు. ఈ ఘటన జరిగిన అనంతరం స్థానికులు స్కూల్‌పై దాడి చేసి, తగలబెట్టారు!
ఇదీ జరిగింది..
కరీంగంజ్ జిల్లాలో ఆగస్ట్ 12న జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. తరగతి గదిలో అశ్లీల చిత్రాలు చూడాలని విద్యార్థినిని బలవంతం చేశాడు. అనంతరం ఆమెను అసభ్యకరంగా ముట్టుకున్నాడు.
అయితే ఈ విషయాన్ని బాలిక తల్లితండ్రులకు తొలుత చెప్పలేదు. చివరికి ధైర్యం తెచ్చుకుని అసలు ఏం జరిగిందో వివరించింది.
“ఈ విషయాన్ని మొదట మాకు చెప్పడానికి ఆమె సంకోచించింది. ఆ తర్వాత తల్లికి చెప్పింది, ఏదో అసభ్యకరం వీడియో చూడాలని టీచర్ తనను బలవంతం చేశాడని ఆమె వెల్లడించింది. ఆమెను అసభ్యకర రీతిలో ముట్టుకున్నట్టు చెప్పింది,' అని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనపై బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కరీంగంజ్ ఎస్పీ పార్థ ప్రతిమ్ దాస్ తెలిపారు. అయితే నిందితుడిని పట్టుకునేందుకు స్కూల్‌కి వెళ్లగా, అతని అప్పటికే తప్పించుకున్నట్టు వివరించారు.
మరోవైపు బాలికకు జరిగిన విషయం గురించి ఆ ప్రాంతంలోని ప్రజలకు తెలిసింది. ఆగ్రహించిన స్థానికులు ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించారు, కానీ అతను తప్పించుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు పాఠశాలను ధ్వంసం చేసి, నిప్పంటించి తగులబెట్టారు.
స్థానికులు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందున వారిపై కూడా కేసు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు, త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని అధికారులు వెల్లడించారు.
“బాగా చదువుకోవాలని మా పిల్లల్ని బడికి పంపుతాము. మంచి మనుషులుగా ఎదగాలని కోరుకుంటాము. కానీ ఇలాంటి టీచర్ల నుంచి వారు ఏం నేర్చుకుంటారు?” అని ఓ స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
11ఏళ్ల బాలికపై అత్యాచారం..
1 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యూపీలోని బల్లియాలో ఈ ఘటన జరిగింది. ఆ మైనర్ బాలిక ఆగస్టు 6న స్నేహితుడి ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడు ఆ ప్రాంతంలోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం