11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి వీడియో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన కీచకుడు-man arrested for raping 11 year old in up ballia ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి వీడియో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన కీచకుడు

11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి వీడియో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన కీచకుడు

HT Telugu Desk HT Telugu
Aug 16, 2024 02:24 PM IST

కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించగా, ఇంకా అత్యాచారాలు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ మైనర్ బాలికపై అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలోని బల్లియాలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి వీడియో తీసి దానిని ఆన్‌లైన్‌లో పోస్టు చేసిన కీచకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

మైనర్ బాలికపై అత్యాచారం
మైనర్ బాలికపై అత్యాచారం

బల్లియా(యూపీ), ఆగస్టు 16: 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యూపీలోని బల్లియాలో ఈ ఘటన జరిగింది.

ఆ మైనర్ బాలిక ఆగస్టు 6న స్నేహితుడి ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడు ఆ ప్రాంతంలోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నిందితుడు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేయడంతో ఆదివారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు కల్లు (20)ను అరెస్టు చేసినట్లు ఆ ప్రాంత సర్కిల్ ఆఫీసర్ మహ్మద్ ఫహీమ్ ఖురేషి తెలిపారు. కల్లును గురువారం అరెస్టు చేసి జైలుకు పంపినట్లు ఖురేషీ తెలిపారు.