H1B visa lottery : హెచ్​1బీ వీసాకు అప్లై చేస్తున్నారా? 2023లో కష్టమే!-applying for h1b visa 2023 is the worst year for lottery expert explains the reason ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Applying For H1b Visa? 2023 Is The Worst Year For Lottery, Expert Explains The Reason

H1B visa lottery : హెచ్​1బీ వీసాకు అప్లై చేస్తున్నారా? 2023లో కష్టమే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 08, 2023 01:21 PM IST

H1B visa lottery 2023 : అమెరికాలో ఉంటూ.. హెచ్​-1బీ కోసం ఎదురుచూస్తున్నారా? 2023లోనూ కష్టమే అని నిపుణులు అంటున్నారు. ఇందుకు పలు కారణాలను చెబుతున్నారు.

హెచ్​1బీ వీసాకు అప్లే చేస్తున్నారా? 2023లో కష్టమే!
హెచ్​1బీ వీసాకు అప్లే చేస్తున్నారా? 2023లో కష్టమే!

H1B visa lottery 2023 : హెచ్​-1బీ వీసా విషయంలో 2023 ఏడాది.. ‘అత్యంత దారుణమైనది’గా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా లాటరీ విధానంతో చాలా మందికి నష్టం జరగొచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది.. హెచ్​-1బీ రిజిస్ట్రేషన్లు 5లక్షలు దాటిపోవచ్చని అంటున్నారు. వీటిల్లో కేవలం 85వేల వరకే ఆమోదం పొందే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఇందుకు గల కారణాలను.. యూఎస్​ ఇమ్మిగ్రేషన్​ లాయర్​ రాబర్ట్​ వెబ్బర్​ వెల్లడించారు.

హెచ్​-1బీ వీసా అంటే ఏంటి?

అమెరికాలో పని చేసేందుకు ఇతర దేశాల వారికి హెచ్​ 1బీ వీసాలు ఇస్తుంది అక్కడి ప్రభుత్వం. ఇలా వెళ్లేవారిలో చాలా మంది భారతీయులు, చైనీయులు ఉంటారు. అందుకే హెచ్​-1బీపై ఏ అప్డేట్​ వచ్చినా అది కీలకమే అవుతుంది.

2023లో ఎందుకు కష్టమవుతుంది?

H1B visa process : ఎలక్ట్రానిక్​ రిజిస్ట్రేషన్​:- ఈ సిస్టెమ్​ను 2020లో లాంచ్​ చేశారు. వాస్తవానికి ఇదొక గొప్ప ప్రక్రియ. మొత్తం హెచ్​-1బీ ప్రాసెస్​ను ఇది సులభతరం చేసేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో దీనిని అమలు చేయడం చాలా కష్టమవుతోంది! కొత్త వ్యవస్థ కారణంగా అప్లికేషన్​ నిబంధనలు తగ్గిపోయాయి. ఫలితంగా అప్లికేషన్లు భారీగా పెరిగాయి. పాత వ్యవస్థలో.. అప్లికేషన్​ వేసేందుకు చాలా నిబంధనలు, అర్హతలు ఉండేవి.

2020లో 2,74,000గా ఉన్న హెచ్​-1బీ రిజిస్ట్రేషన్ల సంఖ్య.. 2021లో 3,08,000కు పెరిగింది. ఇక 2022లో 4,83,000కి చేరింది.

జాబ్స్​.. జాబ్స్​..

H1B visa process 2023 : ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో అమెరికాలోని చాలా ఐటీ కంపెనీలు.. జాబ్​ కట్స్​ తీసుకుంటున్న వార్తలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ.. అమెరికాలో జాబ్స్​ డేటా శక్తివంతంగా ఉంది! యూఎస్​ లేబర్​ డిపార్ట్​మెంట్​ ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2,23,000 ఉద్యోగాలను సృష్టించింది. అంటే.. జాబ్​ సీకర్స్​కు సగటున 1.7 ఉద్యోగాలు ఉన్నట్టు. ఫలితంగా.. ఉద్యోగం సులభంగా దొరికే అతి తక్కువ దేశాల్లో ఒకటిగా అమెరికా నిలిచింది. ఈ నేపథ్యంలో హెచ్​-1బీ వీసాకు భారీగా డిమాండ్​ వస్తుందని అంచనాలు ఉన్నాయి.

టెక్​ సంస్థల లేఆఫ్​..

బడా కంపెనీల లేఆఫ్​ల కారణంగా అమెజాన్​ వంటి కంపెనీల్లో పనిచేస్తున్న ఎఫ్​-1 స్టూడెంట్​కి కూడా లాటరీ దక్కడం కష్టమైపోయింది. డిమాండ్​ ఎక్కువగా ఉంటే.. లాటరీ రాకపోయే రిస్క్​ సాధారణంగా ఉంటూనే ఉంటుంది. అయితే.. లాటరీలో ఎంపికైనా.. ప్రాసెస్​లో ఎలిమినేట్​ చేసే ప్రమాదం ఈసారి ఎక్కువగానే ఉండొచ్చు.

గతేడాది లాటరీలో రాని వారు..

H1B Visa lottery waiting status : 2022 మార్చ్​లో రికార్డు స్థాయిలో లాటరీ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. వారిలో చాలా మందికి హెచ్​-1బీ వీసా రాలేదు. వారందరు.. ఈసారి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం