H1b green card for Indians : భారతీయులకు గుడ్​ న్యూస్​.. హెచ్​ 1బీ, గ్రీన్​ కార్డుపై అమెరికా కీలక నిర్ణయం!-us h 1b visa green card process to get easier indians to benefit ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Us H-1b Visa, Green Card Process To Get Easier, Indians To Benefit

H1b green card for Indians : భారతీయులకు గుడ్​ న్యూస్​.. హెచ్​ 1బీ, గ్రీన్​ కార్డుపై అమెరికా కీలక నిర్ణయం!

Sharath Chitturi HT Telugu
Sep 24, 2022 12:51 PM IST

H1b green card timeline for Indians : హెచ్​ 1బీ, గ్రీన్​ కార్డుల విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది అమల్లోకి వస్తే.. భారతీయులకు లబ్ధిచేకూరుతుంది!

భారతీయులకు తీపి కబురు.. హెచ్​ 1బీ, గ్రీన్​ కార్డులపై అమెరికా కీలక నిర్ణయం!
భారతీయులకు తీపి కబురు.. హెచ్​ 1బీ, గ్రీన్​ కార్డులపై అమెరికా కీలక నిర్ణయం!

H1b visa processing time : గ్రీన్​ కార్డులు, హెచ్​ 1బీ వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా వీసాల ప్రాసెసింగ్​ వ్యవధిని 6 నెలలకు తగ్గించేందుకు ప్రభుత్వ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రెసిడెన్షియల్​ కమిషన్​ సిఫార్సులను ఆచరణలోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. అమెరికాలో జీవిస్తున్న లక్షలాది మంది భారత్​, చైనా వలసదారుల కుటుంబాలకు లబ్ధిచేకూరుతుంది!

ట్రెండింగ్ వార్తలు

ఏషియన్​ అమెరికన్స్​, నేటివ్​ హవాయన్స్​, పెసిఫిక్​ ఐలాండర్స్​పై ప్రెసిడెంట్​​ అడ్వాజరీ కమిషన్​.. మే 12న ఓ నివేదికను రూపొందించింది. ఇది శ్వేతసౌధానికి ఆగస్టు 24న చేరింది. అధ్యక్షుడు జో బైడెన్​ వద్దకు తీసుకెళ్లే ముందు.. ఈ సిఫార్సులను వైట్​ హైజ్​ డొమెస్టిక్​ పాలసీ కౌన్సిల్​ ప్రస్తుతం సమీక్షిస్తోంది.

Green card processing time : కొవిడ్​ కారణాలు, సిబ్బంది కొరత, 2017లో విధించి ట్రావెల్​ బ్యాన్​తో.. గ్రీన్​ కార్డుల జారీ విషయంలో తీవ్రంగా ఆలస్యమైందని నివేదిక పేర్కొంది. జారీ చేయాల్సిన వాటికన్నా చాలా తక్కువు గ్రీన్​కార్డులు ఇచ్చినట్టు తెలిపింది. అందువల్ల.. ఎన్​వైసీ(డిపార్ట్​మెంట్​ ఆఫ్​ స్టేట్​ నేషనల్​ వీసా సెంటర్​) భారీగా నియామకాలు చేపట్టి.. గ్రీన్​ కార్డు అప్లికేషన్లను త్వరగా ప్రాసెస్​ చేయాలని సూచించింది. 2022 ఆగస్టు నుంచి మూడు నెలల పాటు 100శాతం వీసా ఇంటర్వ్యూలు చేపట్టాలని సిఫార్సు చేసింది. ఈ విధంగా.. గ్రీన్​ కార్డుల జారీ విషయంలో కలిగిన అంతరాన్ని 2023 చివరి నాటికి పూడ్చివేయాలని స్పష్టం చేసింది.

గ్రీన్​ కార్డు విసా ఇంటర్వ్యూలు, విసా ప్రాసెసింగ్​ కాల వ్యవధి గరిష్ఠంగా 6 నెలలు మించకూడదని నివేదిక తెలిపింది. ఇప్పటి వరకు పెండింగ్​లో ఉన్న వీసాలను త్వరితగతిన పూర్తి చేయాలని వెల్లడించింది. హెచ్​ 1బీ, హెచ్​2ఏ విషయాల్లో రెండు నెలల కాలవ్యవధిలోనే పనిని పూర్తిచేయాలని, వర్క్​ పర్మిట్​ పొడిగింపు లిమిట్​ని 180 రోజుల నుంచి 365 రోజులు పెంచాలని సూచించింది.

US H1b visa : నివేదిక ప్రకారం.. 2021ఆర్థిక ఏడాదిలో 2,26,000 కుటుంబ ఆధారిత గ్రీన్​ కార్డులు జారీ చేయాల్సి ఉండగా.. కేవలం 65,452 మాత్రమే ఇచ్చారు.

అమెరికాలో పని చేసేందుకు ఇతర దేశాల వారికి హెచ్​ 1బీ వీసాలు ఇస్తుంది ప్రభుత్వం. అక్కడకి వలస వెళ్లి జీవిస్తున్న ఇతర దేశస్థులకు.. గ్రీన్​ కార్డులు(పర్మనెంట్​ రెసిడెంట్​) ఇస్తుంది. ఇలా వెళ్లే వారిలో చైనా, ఇండియా నుంచే చాలా మంది ఉన్నారు. ఫలితంగా.. ఈ సిఫార్సులు అమల్లోకి వస్తే.. భారతీయులకు లబ్ధిచేకూరినట్టు అవుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం