`సీఏఏ`ను అమ‌లు చేసి తీరుతాం- అమిత్ షా-amit shah accuses tmc of spreading rumours on caa says it will be implemented once covid ends ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  `సీఏఏ`ను అమ‌లు చేసి తీరుతాం- అమిత్ షా

`సీఏఏ`ను అమ‌లు చేసి తీరుతాం- అమిత్ షా

HT Telugu Desk HT Telugu
May 05, 2022 08:01 PM IST

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం(సీఏఏ)ను క‌చ్చితంగా అమ‌లు చేసి తీరుతామ‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. క‌రోనా స‌మ‌స్య స‌మ‌సిపోయిన త‌రువాత సీఏఏను అమ‌లు చేస్తామ‌న్నారు. ప‌శ్చిమబెంగాల్లోని సిలిగురిలో గురువారం అమిత్ షా ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

<p>కేంద్ర హోం మంత్రి అమిత్ షా</p>
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (HT_PRINT)

కొన్నాళ్లుగా ప‌క్క‌న‌బెట్టిన వివాదాస్ప‌ద పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని(సీఏఏ) మ‌ళ్లీ సెంట‌ర్ స్టేజ్‌కి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఇదే విష‌యాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ప‌ష్టం చేశారు. సీఏఏను అమ‌లు చేయ‌బోర‌ని, ఆ చ‌ట్టాన్ని అమ‌లు కానివ్వ‌బోమ‌ని ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ అబ‌ద్ధాల‌ను ప్ర‌చారం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. `మీ ముందే చెబుతున్నా. క‌రోనా స‌మ‌స్య అంతం కాగానే, సీఏఏ అమ‌లు ప్రారంభ‌మ‌వుతుంది` అని షా పేర్కొన్నారు. `మ‌మ‌త దీదీ.. దేశంలోకి చొర‌బాట్లు కొన‌సాగాల‌ని మీరు కోరుకుంటున్నారా? సీఏఏ అనేది ఒక వాస్త‌వం. దాన్ని అమ‌లు చేసి తీరుతాం. టీఎంసీ ఏం చేయ‌లేదు` అని వ్యాఖ్యానించారు.

చెత్త వాగుడు

దీనిపై ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ స్పందించారు. 2024లో వారు అధికారంలోకి రాబోవ‌డం లేదు. ఇక్క‌డికి వ‌చ్చిన ప్ర‌తీసారి ఏదో ఒక చెత్త వాగుతుంటారు. మ‌నం ఐక‌మ‌త్యంగా ఉంటే వారు ఏం చేయ‌లేరు` అని మండిప‌డ్డారు. దేశంలో కోవిడ్ విజృంభ‌ణ‌కు ముందు 2019, 2020 మొద‌ట్లో, దేశంలో సీఏఏ వ్య‌తిరేక ఆందోళ‌నలు పెద్ద ఎత్తున చెల‌రేగాయి. 2015కు ముందు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌ల నుంచి భార‌త్ వ‌ల‌స వ‌చ్చిన ముస్లిమేత‌రుల‌కు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పౌర‌స‌త్వం క‌ల్పించేందుకు ఈ సీఏఏ చ‌ట్టం వీలు క‌ల్పిస్తుంద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్