Jack Ma: చాలా కాలం తర్వాత చైనాలో అడుగుపెట్టిన అలీబాబా ఫౌండర్ ‘జాక్ మా’: విద్యార్థులతో చాట్ జీపీటీ గురించి!
Jack Ma Returns to China: అలీబాబా ఫౌండర్ జాక్ మా మళ్లీ చైనాలో అడుగుపెట్టారు. సంవత్సరానికి పైగా విదేశాల్లో ఉన్న ఆయన మళ్లీ డ్రాగన్ దేశానికి తిరిగివచ్చారు.
Jack Ma Returns to China: ప్రముఖ సంస్థ అలీబాబా (Alibaba) ఫౌండర్, చైనా బడా వ్యాపారవేత్త జాక్ మా (Jack Ma).. మళ్లీ స్వదేశంలో అడుగుపెట్టారు. చాలా కాలం తర్వాత ఆయన చైనాకు వచ్చారు. 2021 రెండో అర్ధభాగం నుంచి పలు దేశాల్లో తిరిగిన ఆయన ఎట్టకేలకు ఇప్పుడు డ్రాగన్ దేశానికి తిరిగివచ్చారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. యాంట్ గ్రూప్, అలీబాబ్ ఫౌండర్ జాక్ మా మళ్లీ చైనాలో అడుగుపెట్టారని పేర్కొంది. వివరాలివే.
చాట్‍జీపీటీ గురించి విద్యార్థులతో..
Jack Ma Returns to China: హాంగ్‍జోయ్‍లో తాను స్థాపించిన స్కూల్‍కే జాక్ మా.. మొదటిగా వెళ్లారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఏఐ చాట్‍బోట్ ‘చాట్‍జీపీటీ’ (ChatGPT) గురించి విద్యార్థులతో ఆయన ముచ్చటించారని తెలిపింది. అలాగే విద్యకు సంబధించిన మరిన్ని అంశాలపై మాట్లాడారని ఆ రిపోర్ట్ పేర్కొంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మీడియా సంస్థ కూడా జాక్ మాకు చెందినదే.
Jack Ma Returns to China: జాక్ మా తిరిగివచ్చేశారనే వార్తతో చైనా స్టాక్ మార్కెట్‍లో అలీబాబా షేర్ ధర 4 శాతం పెరిగింది.
Jack Ma Returns to China: 2021లో చైనాను విడిచివెళ్లిన తర్వాత జపాన్, ఆస్ట్రేలియా, థాయ్‍ల్యాండ్ దేశాల్లో జాక్ మా కనిపించారు. చాలా అరుదుగా బయటికి వచ్చేవారు.
2020లో మొదలైన కష్టాలు
Jack Ma: తన భావాలను, ఆలోచనలను జాక్ మా చాలా స్వతంత్రంగా చెబుతారు. ఈ క్రమంలో 2020లో ఓ పబ్లిక్ మీటింగ్‍లో.. చైనా రెగ్యులేటరీ సిస్టంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సిస్టంను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పటి నుంచి ఆయనకు కష్టాలు ఎదురయ్యాయి. చైనా అధికార వర్గాలు అలీబాబా, యాంట్ గ్రూప్ సహా జాక్ మాకు చెందిన సంస్థలపై వరుసగా దాడులు చేశాయి. ఆర్థికపరంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. దీంతో అలీబాబా, యాంట్ గ్రూప్ తీవ్రంగా నష్టపోయాయి. జాక్ మా.. ఏకంగా దేశాన్ని విడిచివెళాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Jack Ma Returns to China: ప్రైవేటు రంగానికి మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నట్టు చైనా ప్రభుత్వం కొన్ని నెలలుగా చెబుతోంది. అయితే చైనాకు దూరంగా ఉండాలని జాక్ మా తీసుకున్న నిర్ణయం కారణంగా.. యువ పారిశ్రామికవేత్తలు సంస్థలను నెలకొల్పేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదన్న వాదనలు వినిపించాయి. దీంతో జాక్ మా.. పట్ల చైనా తన వైఖరి మార్చుకున్నట్టు కనిపిస్తోందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
Jack Ma Returns to China: ఇక జాక్ మా తమ స్కూల్‍కు వచ్చినప్పటి ఫొటోలను యుంగా ఎడ్యుకేషన్ పోస్ట్ చేసింది. వీచాట్‍లో ఫొటోలను షేర్ చేసింది. కాగా, చైనాకు వచ్చే ముందు హాంకాంగ్‍లో ఆగి, స్నేహితులను కలిసి వచ్చారట జాక్ మా.