Akasa Air: ఆగస్టు 7న ఎగరనున్న ఆకాశ ఎయిర్ తొలి విమానం-akasa air to operate its first commercial flight on aug 7 opens ticket sales ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Akasa Air: ఆగస్టు 7న ఎగరనున్న ఆకాశ ఎయిర్ తొలి విమానం

Akasa Air: ఆగస్టు 7న ఎగరనున్న ఆకాశ ఎయిర్ తొలి విమానం

HT Telugu Desk HT Telugu
Jul 22, 2022 11:50 AM IST

Akasa Air: ఆకాశ ఎయిర్ లైన్స్ ఆగస్టు 7న తన వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించనుంది.

<p>ఆగస్టు 7 నుంచి ఆకాశ ఎయిర్ విమాన సేవలు ప్రారంభం కానున్నాయి</p>
ఆగస్టు 7 నుంచి ఆకాశ ఎయిర్ విమాన సేవలు ప్రారంభం కానున్నాయి (PTI)

న్యూఢిల్లీ, జూలై 22: బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను కొనుగోలు చేసిన ఆకాశ ఎయిర్ ముంబై-అహ్మదాబాద్ రూట్‌లో తన మొదటి సర్వీస్‌ను ఆగస్టు 7న ప్రారంభించనుంది. దీంతో తమ వాణిజ్య విమాన కార్యకలాపాలు మొదలవుతాయని కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ శుక్రవారం తెలిపింది.

ఆగస్ట్ 7 నుంచి ముంబై-అహ్మదాబాద్ రూట్‌లో 28 వీక్లీ ఫ్లైట్‌లలో టికెట్ విక్రయాలను ప్రారంభించామని, అలాగే ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి రూట్‌లో 28 వీక్లీ ఫ్లైట్‌లలో నడపనున్నట్లు ఆకాశ ఎయిర్ ఒక ప్రకటనలో తెలిపింది.

క్యారియర్ రెండు 737 మ్యాక్స్ విమానాలతో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది. బోయింగ్ ఒక మాక్స్ విమానాన్ని డెలివరీ చేసింది. రెండోది ఈ నెలాఖరులో డెలివరీ కానుంది.

ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ మాట్లాడుతూ ‘సరికొత్త బోయింగ్ 737 మ్యాక్స్ విమానంతో ముంబై - అహ్మదాబాద్ మధ్య విమానాలతో కార్యకలాపాలను ప్రారంభించబోతున్నాం..’ అని చెప్పారు.

‘దశలవారీగా నెట్ వర్క్ విస్తరిస్తాం. క్రమంగా మరిన్ని నగరాలకు సేవలు అందిస్తాం. మొదటి సంవత్సరంలో ప్రతి నెలా రెండు విమానాలు యాడ్ అవుతాయి..’ అని ఆయన చెప్పారు.

ఆకాశ ఎయిర్‌లైన్స్ క్యారియర్ జూలై 7న ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA నుండి దాని ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (AOC) పొందింది.

ఆగస్టు 2021లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మాక్స్ విమానాలకు పచ్చ జెండా ఊపింది. ఆకాశ ఎయిర్ 72 మ్యాక్స్ విమానాలను కొనుగోలు చేయడానికి గత ఏడాది నవంబర్ 26న బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.ht

Whats_app_banner

టాపిక్