Activist insults journalist for not wearing bindi: ‘‘బొట్టు పెట్టుకుని రా పో’’
Activist insults journalist for not wearing bindi: మహారాష్ట్రకు చెందిన ఒక వివాదాస్పద హిందూ సంఘాల నేత గురువారం ముంబైలో ఒక జర్నలిస్ట్ తో అభ్యంతరకరంగా మాట్లాడారు.
Activist insults journalist for not wearing bindi: శంభాజీ భిడే.. మహారాష్ట్రలో క్రియాశీలకంగా ఉండే ఒక హిందుత్వ సంఘ నేత. వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనకు అలవాటు. గతంలో, తన మామిడి తోటలో పండిన మామిడి పళ్లు తింటే, మగపిల్లలే పుడ్తారని వ్యాఖ్యానించి ఫేమస్ అయ్యారు.
Activist insults journalist for not wearing bindi: బొట్టు పెట్టుకోవాల్సిందే..
ఆ శంభాజీ భిడే గురువారం మహారాష్ట్ర సెక్రటేరియట్ కు వచ్చారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను కలిశారు. తిరిగి వెళ్తుండగా సామ్ టీవీ న్యూస్ చానెల్ కు చెందిన ఒక మహిళా జర్నలిస్ట్ ఆయనను ప్రశ్నించడం ప్రారంభించారు. దాంతో, శంభాజీ ఆ జర్నలిస్ట్ వైపు చూసి, ఆమె బొట్టు పెట్టుకోకపోవడం గమనించి.. ‘ముందు నుదుటిపై బొట్టు పెట్టుకుని రా.. ఆ తరువాత ఇంటర్వ్యూ ఇస్తా’ అని వ్యాఖ్యానించారు.
Activist insults journalist for not wearing bindi: భరతమాతతో సమానం
మహిళలు భరత మాతతో సమానమని, వారు భర్త లేని వారుగా బొట్టు లేకుండా ఉండడం చూడలేనని అన్నారు. ‘ప్రతీ మహిళ నాకు భరత మాతతో సమానం. భరత మాత విధవ కాదు. అందువల్ల మహిళలు బొట్టు పెట్టుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు టీవీలో ప్రసారం కావడంతో, అవి ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అలాగే, ఆ జర్నలిస్ట్ ఈ ఘటనను తన ట్విటర్ హ్యాండిల్ పై షేర్ చేసుకుంది. బొట్టు పెట్టుకోవాలా? వద్దా? అనేది తన వ్యక్తిగత నిర్ణయమని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళాకమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకంకర్ స్పందించారు. మహిళను అవమానించడంపై శంభాజీ భిడేకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
టాపిక్