Texas mall shooting : టెక్సాస్ మాల్లో కాల్పుల కలకలం- 9మంది మృతి
Texas mall shooting : అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌లోని ఓ షాపింగ్ మాల్లో ఆగంతకుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు తెగించిన వ్యక్తి.. పోలీసుల చేతిలో హతమయ్యాడు.
Allen premium outlets shooting : గన్ కల్చర్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అమెరికాలో మరో కలకలం! టెక్సాస్‌లోని ఆలెన్లో ఉన్న ఓ మాల్‌లోకి దూసుకెళ్లిన ఆగంతకుడు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు.. ఆగంతకుడిని మట్టుబెట్టారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మాల్లో కుప్పలుతెప్పలుగా పడి ఉన్న మృతదేహాలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
కాల్పుల మోత..
"షూటర్‌ను పోలీసులు మట్టుబెట్టారు. తాజా కాల్పుల ఘటనలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో 7 మృతదేహాలు లభించాయి. ఆసుపత్రికి తరలించిన క్షతగాత్రుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు," అని ఆలెన్ ప్రాంతానికి చెందిన ఫైర్ చీఫ్ జొనాథన్ బాయ్డ్ మీడియాకు తెలిపారు.
Texas shooting live updates : స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఆలెన్ ప్రిమియం ఔట్‌లెట్‌లోకి ప్రవేశించాడు ఆగంతకుడు. బ్లాక్ సెడాన్ కారులో నుంచి దిగి.. ఆయుధాలతో షూటింగ్ మొదలుపెట్టాడు.
"కాల్పుల శబ్ధం వినిపించింది. ఘటనాస్థలానికి వెళ్లి అనుమానితుడితో పోరాడాము. అతడిని మట్టుబెట్టాము. అతని వివరాలు తెలియాల్సి ఉంది," అని టెక్సాస్ పోలీసు విభాగానికి చెందిన హార్వీ తెలిపారు.
'మాటలకు అందని విషాదం..'
Texas mall shooting death toll : మాల్లోని దృశ్యాలు భయానకంగా ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పుల శబ్ధం వినిపించగానే.. అనేక మంది భయంతో పరుగులు తీసినట్టు వివరించారు. కొందరు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించినట్టు పేర్కొన్నారు. వీరిలో ఓ సెక్యూరిటీ గార్డు, 5ఏళ్ల చిన్నారి కూడా ఉన్నట్టు చెప్పారు. ‘అమెరికాలో అసలు సురక్షితమైన ప్రాంత అంటూ ఏదైనా ఉందా?’ అని ప్రశ్నించారు.
ఈ ఘటనపై టెక్సాస్ గవర్నర్ గ్రేగ్ అబాట్ స్పందించారు. ఇదొక మాటలకందని విషాదం అని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
America shooting latest news : అమెరికాలో గన్ కల్చర్ అత్యంత ఆందోళనకరంగా ఉంది. 2021లో 49వేల మంది కాల్పులకు ప్రాణాలు విడిచారు. 2020లో ఆ సంఖ్య 45వేలుగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటికే అనేక షూటింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో నలుగురు, అంతకన్నా ఎక్కువమంది మరణించి ఘటనలు ఇప్పటికే 195 నమోదయ్యాయి.
సంబంధిత కథనం