US gun control bill : అమెరికాలో కొత్త చట్టం.. ఇక ‘గన్​ కల్చర్​’కు చెక్​!-us senate passes bipartisan gun safety bill ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Us Senate Passes Bipartisan Gun Safety Bill

US gun control bill : అమెరికాలో కొత్త చట్టం.. ఇక ‘గన్​ కల్చర్​’కు చెక్​!

Sharath Chitturi HT Telugu
Jun 24, 2022 11:11 AM IST

US gun control bill : ఆయుధాలకు సంబంధించి అమెరికాలోని సెనేట్​లో ఓ బిల్లు పాస్​ అయ్యింది. త్వరలో ఇది చట్టంగా మారే అవకాశం ఉంది.

అమెరికాలో కొత్త చట్టం.. ఇక ‘గన్​ కల్చర్​’కు చెక్​!
అమెరికాలో కొత్త చట్టం.. ఇక ‘గన్​ కల్చర్​’కు చెక్​! (AFP)

US gun control bill : అమెరికాలో 'గన్ కల్చర్​' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయుధాలతో మారణహోమాలు జరుగుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సమస్య అమెరికాను పట్టిపీడిస్తోంది. దీనిని అధిగమించే దిశగా అమెరికాలో అడుగులు పడుతున్నాయి! గన్​ కల్చర్​ను నియంత్రించే విధంగా రూపొందించిన ద్వైపాక్షిక బిల్లు ఒకటి.. అమెరికా సెనేట్​లో ఆమోదం పొందింది. ఆయుధాల చట్టాల సంస్కరణపై అమెరికా స్పందించడం.. 30ఏళ్లల్లో ఇదే తొలిసారి.

65-33 ఓట్ల తేడాతో సెనేట్​లో ఆ బిల్లు గట్టెక్కింది. 15మంది రిపబ్లికెన్లు.. అధికార డెమొక్రాట్లకు మద్దతు పలకడం విశేషం. శుక్రవారమే.. ఈ బిల్లు ప్రతినిధుల సభ ముందుకు వెళుతుందని తెలుస్తోంది. అక్కడ గట్టెక్కితే.. అధ్యక్షుడు జో బైడెన్​ వద్దకు వెళుతుంది. ఆయన సంతకంతో ఆ బిల్లు.. చట్టంగా మారుతుంది.

US gun violence : ఇది 13.2బిలియన్​ డాలర్ల బిల్లు! మానసిక ఆరోగ్యం, స్కూళ్ల భద్రత, సంక్షోభ నివారణ, నియంత్రణ కార్యక్రమాలు ఈ బిల్లులో భాగం.

అమెరికాలో ప్రజల వద్ద 390మిలియన్​కు పైగా తుపాకులు ఉన్నాయి. ఒక్క 2020లోనే.. 45వేలకుపైగా మంది అమెరికన్లు ఆయుధాల సంబంధిత ఘటనల్లో మరణించారు. ఆయుధాలతో కొందరు మారణహోమాన్ని సృష్టిస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

టెక్సాస్​ షూటింగ్​ అనంతరం.. ఆయుధాల చట్టాల్లో మార్పులు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో.. సెనేట్​లో బిల్లు పాస్​ అవ్వడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకుంటున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్