Bihar student death : టీచర్​ చితకబాదడంతో.. 7ఏళ్ల విద్యార్థి మృతి!-7 year old bihar student dies in hostel friends say he was beaten over homework ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bihar Student Death : టీచర్​ చితకబాదడంతో.. 7ఏళ్ల విద్యార్థి మృతి!

Bihar student death : టీచర్​ చితకబాదడంతో.. 7ఏళ్ల విద్యార్థి మృతి!

Sharath Chitturi HT Telugu
Mar 25, 2023 02:25 PM IST

Bihar student death in hostel : బీహార్​లోని ఓ హాస్టల్​లో ఓ 7ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. హోంవర్క్​ చేయలేదని టీచర్​ దారుణంగా కొట్టడంతోనే అతను ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది!

టీచర్​ చితకబాదడంతో.. 7ఏళ్ల విద్యార్థి మృతి!
టీచర్​ చితకబాదడంతో.. 7ఏళ్ల విద్యార్థి మృతి!

Bihar student death in hostel : బిహార్​లో దారుణ ఘటన జరిగింది. హోంవర్క్​ చేయలేదన్న కారణంగా ఓ విద్యార్థిని టీచర్​ చితకబాదినట్టు, ఫలితంగా ఆ విద్యార్థి మరణించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది..

7ఏళ్ల ఆదిత్య యాదవ్​.. బిహార్​ సహస్ర జిల్లాలోని ఓ రెసిడెన్షియల్​ స్కూల్​లో 4వ తరగతి చదువుకుంటున్నాడు. కాగా గురువారం ఉదయం హాస్టల్​ రూమ్​లో అతడిని అపస్మారక స్థితిలో గుర్తించారు అక్కడి విద్యార్థులు. వెంటనే అతడిని సుజీత్​ కుమార్​ అనే టీచర్​ వద్దకు తీసుకెళ్లారు. ఆదిత్యను ఆసుపత్రిలో విడిచిపెట్టాలని విద్యార్థులకు చెప్పాడు. కొంతసేపటి తర్వాత.. బాలుడి తండ్రి ప్రకాశ్​ యాదవ్​కు సుజీత్​ కుమార్​ ఫోన్​ చేశాడు. తన బిడ్డ అపస్మారక స్థితిలో ఉన్నాడని సమాచారం ఇచ్చాడు.

Bihar crime news : మరోవైపు ఆదిత్య యాదవ్​ను విద్యార్థులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా అప్పటికే అతను మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. శరీరంపై గాయాలేవీ లేవని, బాలుడి మరణానికి గల కారణాలు.. పోస్టుమార్టం నివేదికలో తెలుస్తాయని వైద్యులు స్పష్టం చేశారు.

టీచరే చంపేశాడా..?

ఆదిత్య యాదవ్​ మరణ వార్తతో తోటి విద్యార్థులు షాక్​కు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఓ విషయాన్ని వెల్లడించారు.

Bihar student death : "ఆదిత్య యాదవ్​ను బుధవారం సాయంత్రం సుజీత్​ కుమార్​ టీచర్​ దారుణంగా కొట్టారు. హోంవర్క్​ చేయలేదని కర్రతో చితకబాదాడు. ఆ తర్వాత ఆదిత్య యాదవ్​ గురువారం నిద్ర లేవలేదు," అని 7ఏళ్ల బాలుడి స్నేహితుడు వెల్లడించాడు.

"ఆదిత్య యాదవ్​ను టీచర్​ వరుసగా రెండు రోజులు కొడుతూనే ఉన్నాడు. హోంవర్క్​ చేయలేదని ఓసారి, పాఠాలు గుర్తుపెట్టుకోవడం లేదని ఇంకోసారి దారుణంగా కొట్టాడు," అని మరో విద్యార్థి తెలిపాడు.

నిందారోపణ ఎదుర్కొంటున్న సుజీత్​ కుమార్​.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే.. తాను ఎలాంటి తప్పు చేయలేదన్న సమచారం విడిచిపెట్టి వెళ్లిపోయాడు.

'నా బిడ్డ చనిపోయాడు..'

ఈ ఘటనపై ఆదిత్య యాదవ్​ తండ్రి ప్రకాశ్​ యాదవ్​ స్పందించారు.

Bihar latest news : "ఆదిత్య యాదవ్​ హోలీ రోజు ఇంటికి వచ్చాడు. 14వ తేదీన హాస్టల్​కు తిరిగి వెళ్లాడు. గురువారం ఉదయం నాకు ఫోన్​ వచ్చింది. ఆదిత్య స్పృహ కోల్పోయాడని చెప్పారు. ఆసుపత్రికి తీసుకెళుతున్నట్టు వివరించారు. నేను వెళ్లేసరికే ఆదిత్య చనిపోయాడు. సుజీత్​ కుమార్​ పారిపోయాడు. తప్పు చేయకపోతే సుజీత్​ కుమార్​ ఎందుకు పారిపోయాడు?" అని ప్రకాశ్​ యాదవ్​ అన్నారు.

మరోవైపు ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం