Teacher attacked by parents : టీచర్‌పై దాడి.. పరిగెత్తించి కొట్టిన తల్లిదండ్రులు
Teacher attacked by parents in Tamil Nadu : తమిళనాడులో ఓ టీచర్‌పై దారుణమైన దాడి జరిగింది. బిడ్డను కొట్టాడన్న కారణంతోనే అతడిని పరిగెత్తించి కొట్టినట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. కానీ టీచర్ ఆ విద్యార్థినిని కొట్టలేదని అధికారులు చెబుతున్నారు.
Teacher attacked by parents in Tamil Nadu : తమ బిడ్డను కొట్టాడన్న కారణంతో ఓ టీచర్‌పై తల్లిదండ్రులు దాడికి దిగారు. తమిళనాడు టుటికోరన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రులు.. టీచర్‌ను పరిగెత్తించి మరీ కొట్టిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదీ జరిగింది..
సెల్వి, శివలింగం దంపతులకు ఓ 7ఏళ్ల కూతురు ఉంది. ఆమె 2వ తరగతి చదువుకుంటోంది. కాగా.. ఇటీవలే తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లారు. భరత్ అనే టీచర్‌పై దాడి చేశారు. అక్కడే ఉన్న వారు ఆ దృశ్యాలను వీడియో తీశారు.
Teacher attacked by parents : భరత్ పరిగెడుతుండగా.. తనపై శివలింగం దాడి చేస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఓ సందర్భంలో.. రాయితోనూ దాడి చేశాడు శివలింగం. సెల్వి అన మహిళ.. టీచర్‌ను తిట్టడం కూడా అందులో రికార్డ్ అయ్యింది. "పిల్లలను కొట్టే హక్కు నీకెవ్వరు ఇచ్చారు? నీకు హక్కు లేదు. ఇప్పడు నేను నిన్ను చెప్పుతో కొడతాను," అని ఆ మహిళ గట్టిగా అరిచింది.
అక్కడే ఉన్న విద్యార్థులు, టీచర్లు.. ఈ ఘటనతో షాక్‌కు గురయ్యారు. ఓ టీచర్.. సాయం కోసం అరిచారు. కానీ ఫలితం దక్కలేదు.
Parents attacked teacher in Tamil Nadu : కొంతసేపటికి.. ఘటనాస్థలానికి పోలీసులు వెళ్లారు. అనంతరం సెల్వి, శివలింగంలను అరెస్ట్ చేశారు. వీరితో పాటు చిన్నారి తాత మునుస్వాని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.
'టీచర్.. బిడ్డను కొట్టలేదు!'
తమ బిడ్డపై టీచర్ దాడి చేశాడన్న కోపంతో అతడిని కొట్టినట్టు తల్లిండ్రులు చెబుతున్నారు. అయితే.. టీచర్ ఆ విద్యార్థినిని కొట్టలేదని అధికారులు చెబుతున్నారు.
Parents hit teacher for beating child : "7ఏళ్ల చిన్నారి క్లాస్‌లో బాగా మాట్లాడుతోంది. అది గమనించిన టీచర్.. ఆమెను వేరే చోట కూర్చోవాలని చెప్పాడు. ఆమె లేచి నడిచింది. ఈ క్రమంలోనే ఏదో తగిలి కిందపడిపోయింది. ఆ తర్వాత ఆమె ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లింది. టీచర్ తనను కొట్టాడని తాతకు చెప్పింది. తాత, ఆ విషయాన్ని బిడ్డ తల్లిదండ్రులకు చెప్పాడు. వారిద్దరు స్కూల్‌కు వచ్చి టీచర్‌పై దాడి చేశారు," అని అధికారులు పేర్కొన్నారు.