Nipah virus in Kerala : అంతకంతకు పెరుగుతున్న 'నిపా' కేసులు.. కేరళలో కొవిడ్ తరహా పరిస్థితి!
Nipah virus in Kerala : కేరళలో నిపా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఆరుగురికి పాజిటివ్ అని తేలింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Nipah virus in Kerala 2023 : కేరళలో నిపా వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. తాజాగా.. ఓ 39ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకింది. ఫలితంగా.. కేరళలో నిపా వైరస్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ప్రాణాంతక వ్యాధి.. ఇప్పటికే ఇద్దరిని బలి తీసుకుంది.
కేరళలో నిపా వైరస్ వ్యాప్తిచెందడం.. 2018 నుంచి ఇది నాలుగోసారి. సాధారణంగా.. ఈ వైరస్.. జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. తాజాగా.. రాష్ట్రంలో కనిపిస్తున్న నిపా స్ట్రెయిన్.. బంగ్లాదేశ్ వేరియంట్‌తో పోలి ఉందని అధికారులు చెబుతున్నారు.
కొజికోడ్ జిల్లాలోనే నిపా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. తాజాగా వైరస్‌కు పాజిటివ్‌గా తేలిన వ్యక్తి.. అనారోగ్యం కారణంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతుండగా.. ఆయనకు నిపా వైరస్ టెస్ట్ చేశారు. చివరికి.. ఆయనకు పాజిటివ్ అని తేలింది.
కొజికోడ్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ 24ఏళ్ల వ్యక్తికి గురువారం ఈ వైరస్ సోకింది.
Kerala nipah virus : కొజికోడ్‌లోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 13 మంది అబ్జర్వేషన్లో ఉన్నారు. వీరి రిపోర్టులు ఇంకా రాలేదు. కాకపోతే.. వీరికి తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నాయి.
కొవిడ్ తరహా పరిస్థితి..!
కేరళలో నిపా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. అక్కడ కొవిడ్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కంటామినేషన్ జోన్లు, క్వారంటైన్ వంటి పేర్లు మళ్లీ వినిపిస్తున్నాయి. కొజికోడ్‌లోని 9 పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా మార్చారు. వందలాది మంది ఆషా వర్కర్లు.. ఇంటింటికీ వెళ్లి చెకప్స్ నిర్వహిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. డేటాను సేకరిస్తున్నారు. అనుమానం వస్తే.. వెంటనే పై అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
Nipah virus cases in Kerala : కేరళలో గత నెల చివర్లో ఒకరు, ఈ వారం మొదట్లో ఒకరు.. నిపా వైరస్ కారణంగా మరణించారు. వీరిని కలిసిన వారిని పరీక్షించేందుకే కంటామనినేటెడ్ జోన్లను ఏర్పాటు చేసింది స్థానిక యంత్రాంగం. వీరు.. దాదాపు 600మందిని కలిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం.. మొత్తం 53 కంటామినేటెడ్ జోన్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో నిపా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగితే, ఈ జోన్ల సంఖ్యను ఇంకా పెంచి, పర్యవేక్షించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
2018లో మొదలు..!
నిపా వైరస్‌తో 2018లో కేరళ విలవిలలాడింది. నాడు.. 21మంది ప్రాణాలు కోల్పోయారు. 2019, 2021లోనూ ప్రజలను నిపా భయపెట్టింది. మళ్లీ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
Kerala nipah virus death toll : జ్వరం, ఊపీరి పీల్చుకోవడం కష్టంగా మారడం, తలనొప్పి, వాంతులు వంటివి నిపా వైరస్ లక్షణాలు. ఈ వ్యాధికి సరైన చికిత్స లేకపోవడం, వ్యాక్సిన్లు కూడా అందుబాటులో లేకపోవడం అత్యంత ఆందోళనకరమైన విషయం.
సంబంధిత కథనం