Nipah virus : కేరళలో మళ్లీ నిపా కలకలం.. ప్రాణాంతక వ్యాధి సోకి ఇద్దరు మృతి!
Nipah virus : కేరళలో నిపా వైరస్ కలకలం సృష్టించింది. ఇప్పటికే ఒక జిల్లాకు అలర్ట్ జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ వ్యాధి సోకి ఇద్దరు మరణించారని వైద్యులు అనుమానిస్తున్నారు.
Nipah outbreak in Kerala : దేశంలో నిపా వైరస్ కలకలం సృష్టించింది. కేరళలో.. ఈ ప్రాణాంత వ్యాధి సోకి ఇప్పటికే ఇద్దరు మరణించినట్టు ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొజికోడ్ జిల్లాలో అలర్ట్ జారీ చేసింది.
నిపానే కారణమా..?
జ్వరం కారణంగా ఇద్దరు కేరళవాసులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం వీటిని అసహజ మరణాలుగా గుర్తించింది. నిపా వైరస్ కారణంగానే ఈ మరణాలు సంభవించి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేసింది. మృతుల్లో ఒకరి బంధువు కూడా తీవ్ర జ్వరంతో.. ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కేరళలో నిపా కలవరం నేపథ్యంలో.. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీనా జార్జ్.. సోమవారం రాత్రి ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Nipah alert in Kozhikode : కేరళలో నిపా వైరస్‌ను తొలిసారిగా 2018 మే 19న గుర్తించారు. అప్పటి నుంచి 2021 వరకు అనేకమంది ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి మరణించారు. గతంలో కొజికోడ్లోనూ అనేకమందికి ఈ వైరస్ సోకింది.
డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రకారం.. ఈ నిపా వైరస్ అనేది ఓ జూనోటిక్ డిసీజ్. అంటే.. ఇది జంతువుల నుంచి మనుషులకు పాకుతుందని అర్థం. ఆహారం, భౌతికంగా వేరొకరిని తాకినా.. ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
Nipah virus Kerala : నిపా వైరస్ సోకిన వారు వివిధ అనారోగ్య లక్షణాలతో బాధపడుతుంటారు. ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. జ్వరం ఎక్కువగా, ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. చివరికి ఎన్సిఫలైటిస్ కూడా వస్తుంది.
"మనుషులే కాదు. ఈ వ్యాధి జంతువులకు కూడా ప్రమాదకరమే. పందుల్లో దీనిని ఎక్కువగా చూడవచ్చు," అని గతంలో డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
నిపా వైరస్‌కు సరైన చికిత్స అంటూ ఇంకా ఏదీ లేకపోవడం ఆందోళనకర విషయం. అయితే ఈ వ్యాధి సోకకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. నేల మీద పడిన పండ్లు తినొద్దని, వీధుల్లోని పందుల దగ్గరకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.
సంబంధిత కథనం