PM comments on NEP and 5G: ఇంగ్లీష్ భాషపై బానిస మనస్తత్వం వీడాలి’
PM comments on NEP and 5G: ఆంగ్ల భాష కేవలం ఒక సమాచార మార్పిడి సాధనం మాత్రమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన మేధావి అయిపోరని వ్యాఖ్యానించారు.
ఆంగ్ల భాషకు సంబంధించి మనలో ఉన్న బానిసత్వ భావనను వదిలేయాలని ప్రధాని మోదీ సూచించారు. ఇంగ్లీష్ వస్తేనే మేధావి గా భావిస్తారన్న ఆలోచన వీడాలని, ఆంగ్లం కేవలం ఒక సమాచార మార్పిడి సాధనం మాత్రమేనని వ్యాఖ్యానించారు.
PM comments on NEP and 5G: 5జీ పై..
గుజరాత్ లో మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్ లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన 5జీ టెక్నాలజీతో విద్యా విధానం మరో స్థాయికి చేరుతుందన్నారు. స్మార్ట్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ టీచింగ్స్ ను మించి మరో లెవెల్ కు మన విద్యా విధానాన్ని తీసుకువెళ్తుందన్నారు. విద్యార్థులు ఇకపై వర్చువల్ రియాలిటీని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ను, ఇతర అత్యాధునిక సాంకేతికతలను నేర్చుకుంటారన్నారు.
PM comments on NEP and 5G: ఇంగ్లీష్ పై..
భారత్ లో ఇంగ్లీష్ భాష చుట్టూ అలుముకున్న బానిస మనస్తత్వాన్ని విడనాడాలని ప్రధాని సూచించారు. ఇంగ్లీష్ వస్తేనే మేధావిగా పరిగణిస్తారని, అది సరికాదని, ఇంగ్లీష్ కేవలం మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ మాత్రమేనని ప్రధాని వివరించారు. ఇంగ్లీష్ రాకపోవడం ఇన్నాళ్లుగా అభివృద్ధికి ఒక అడ్డంకిగా మారిందన్నారు. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల గ్రామాల్లోని ఎంతోమంది డాక్టర్లుగా, ఇంజినీర్లగా కాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, విద్యార్థులు తమ మాతృ భాషలోనూ నేర్చుకోవచ్చని తెలిపారు. నూతన విద్యా విధానం(New Education Policy) భారతీయ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందని మోదీ తెలిపారు.