Airtel vs Reliance Jio: రూ. 300లోపు జియో, ఎయిర్‌టెల్ అందిస్తున్న ప్లాన్స్ ఇవే! -jio vs airtel value for money prepaid plans under rs 300 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Airtel Vs Reliance Jio: రూ. 300లోపు జియో, ఎయిర్‌టెల్ అందిస్తున్న ప్లాన్స్ ఇవే!

Airtel vs Reliance Jio: రూ. 300లోపు జియో, ఎయిర్‌టెల్ అందిస్తున్న ప్లాన్స్ ఇవే!

HT Telugu Desk HT Telugu
Apr 17, 2022 08:29 PM IST

జియో, ఎయిర్‌టెల్ అందిస్తున్న ప్లాన్స్‌లో ఎక్కువగా రూ. 300 లోపు ఉన్న వాటికే ఆదరణ ఉంది. ఈ ప్లాన్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఇందులోనే అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.

<p>Airtel,Jio</p>
Airtel,Jio

టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం పోటా పోటిగా ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. గత సంవత్సరం ప్రీపెయిడ్ ప్లాన్‌ల పోలిస్తే ఈ ప్లాన్స్ కాస్త ఖరీదుగా ఉన్నాయి.  టెలికాం కంపెనీలు అందిస్తున్న ప్లాన్స్‌లో రూ. 300 లోపు ఉన్న వాటికే ఎక్కువగా ఆదరణ ఉంది. ఈ ప్లాన్స్ డిమాండ్ ఎక్కువగా ఉండడంతో  అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.

irtel

ఎయిర్‌టెల్ అందిస్తున్న ప్లాన్స్ ఎక్కువగా 1GB డేటా లిమిట్‌తోనే ఉన్నాయి. రూ.209, రూ.239, రూ.265 ఎయిర్‌టెల్ ప్లాన్స్‌కు ఎక్కువగా డిమాండ్ ఉంది. ఈ ప్లాన్‌లకు రోజుకు 1GB డేటా లభిస్తోంది. ఇది కాకుండా, ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు, రోజువారీ SMS ప్రయోజనాలు ఉన్నాయి . రూ.209 ప్లాన్ వాలిడిటీ 21 రోజులు కాగా రూ.239 ప్లాన్ 24 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇక, రూ. 265 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఎయిర్‌టెల్ ఇటీవల 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్‌ను కూడా ప్రారంభించింది. దీని ధర రూ.296గా ఉంది. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు, రోజువారీ 100 SMSలు ఇవ్వబడతాయి. ఈ ప్లాన్‌తో 25GB డేటా వస్తుంది. డేటా అయిపోయిన తర్వాత, వినియోగదారులు MBకి 50 పైసలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Reliance Jio

రిలయన్స్ జియో కూడా అద్భుతమైన ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. తాజాగాజీయో 30 రోజుల వ్యాలిడిటీతో ప్రవేశ పెట్టిన రూ.259 ప్లాన్ వినియోగదారులకు ఆకట్టుకుంటుంది. ఈ ప్లాన్‌లో రోజువారీగా 1.5GB డేటాను అందిస్తోంది. డేటా లిమిట్ ముగిసిన తర్వాత వేగం తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, ప్రతిరోజూ 100SMS అందిస్తుంది.

రిలయన్స్ జియో అందిస్తున్న మరో సూపర్ ప్లాన్ రూ. 239 ప్రీపెయిడ్ ప్లాన్. ఇందులో వినియోగదారులు ప్రతిరోజూ 1.5GBను పొందుతారు. ఇది కాకుండా, ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజువారీ 100 SMSలు అందించబడతాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇందులో, జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం