Avocodo Omelette Toast Recipe | అవకాడో ఆమ్లెట్ టోస్ట్.. కడుపు నిండుగా ఉంచే తేలికైన బ్రేక్‌‌ఫాస్ట్!-give the energetic kick to your day with avocado omelette toast check recipe here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Give The Energetic Kick To Your Day With Avocado Omelette Toast, Check Recipe Here

Avocodo Omelette Toast Recipe | అవకాడో ఆమ్లెట్ టోస్ట్.. కడుపు నిండుగా ఉంచే తేలికైన బ్రేక్‌‌ఫాస్ట్!

HT Telugu Desk HT Telugu
Feb 06, 2023 06:06 AM IST

Avocado Omelette Toast Recipe: అవకాడో ఒక ఆరోగ్యకరమైన పండు, గుడ్డుతో ప్రయోజనాలు బోలెడు. ఈ రెండింటిని కలిపి చేసే అవకాడో ఆమ్లెట్ టోస్ట్ బ్రేక్‌‌ఫాస్ట్ రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.

Avocado Omelette Toast Recipe
Avocado Omelette Toast Recipe (Unsplash)

అవోకాడోలు అధిక స్థాయిలో ఆరోగ్యకరమైన, ప్రయోజనకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి, ఇది ఒక వ్యక్తి భోజనం చేసినట్లుగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నతను తగ్గిస్తుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

అవోకాడోలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి, మెగ్నీషియం, బి-6, ఫోలేట్‌తో సహా విటమిన్లు, మినరల్స్ చాలా ఉన్నాయి. మీ రోజువారీ ఆహారంలో అవకాడోలను చేర్చుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే వాటిలోని డైటరీ ఫైబర్, మోనోశాచురేటెడ్ కొవ్వు జీర్ణశయాంతర వ్యవస్థలోని సూక్ష్మజీవులను ప్రభావితం చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ గాఢతను తగ్గించడంతోపాటు, పైత్య ఆమ్లాలను తగ్గిస్తుంది. మీ ఆరోగ్యానికి కావలసిన అన్ని పోషకాలను ఈ ఒక్క పండు అందిస్తుంది.

మీరు కూడా అవొకాడోను మీ డైట్‌లో చేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఒక అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని అందిస్తున్నాం. అదే అవొకాడో ఆమ్లెట్ టోస్ట్. అవొకాడో టోస్ట్‌ను ఆమ్లెట్ తో తినడం ద్వారా, ఈ అల్పాహారం ఎంతో రుచికరంగానూ ఉంటుంది, ఆరోగ్యకరం కూడా మరి అవొకాడో ఆమ్లెట్ టోస్ట్ తెలుసుకోండి ఇక్కడ.

Avocado Omelette Toast Recipe కోసం కావలసినవి

  • 2 గార్లిక్ బ్రెడ్ లేదా మల్టీ గ్రెయిన్ బ్రెడ్ లేదా హోల్ వీట్ బ్రెడ్
  • 1 అవోకాడో
  • 1 కోడి గుడ్డు
  • 1 టేబుల్ స్పూన్ పాలు
  • ఆలివ్ నూనె స్ప్రే
  • 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు
  • నల్ల మిరియాల పొడి
  • రుచికి తగినంత ఉప్పు

అవకాడో ఆమ్లెట్ టోస్ట్‌ తయారీ విధానం

  1. ముందుగా బ్రెడ్‌ను టోస్టర్‌లో లేదా చిన్న స్కిల్లెట్‌లో మీడియం వేడి మీద కాల్చండి.
  2. ఆ తర్వాత అవోకాడోను తీసుకొని ఒక ఫోర్క్‌ సహాయంతో గుచ్చుతూ మెత్తని గుజ్జుగా మార్చండి. .
  3. ఇప్పుడు ఒక గిన్నెలో గుడ్డును పగలకొట్టి, అందులో పాలు కూడా కలిపి గిలక్కొట్టండి.
  4. చిన్న నాన్‌స్టిక్ స్కిల్లెట్‌లో నూనెను పిచికారీ చేసి తక్కువ వేడి మీద వేడి చేయండి.
  5. ఆపై వేడి చేసిన పాన్‌లో గుడ్డు మిశ్రమం పోసి, ఆమ్లెట్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి చల్లి రెండు పక్కలా కాల్చండి.

ఇప్పుడు బ్రెడ్ టోస్టులపైన అవకాడో మిశ్రమం పూసి, ఆపై ఆమ్లెట్ మడత పెడితే అవకాడో ఆమ్లెట్ టోస్ట్‌ రెడీ.

WhatsApp channel

సంబంధిత కథనం