DIY Avocado Oil for Skin | అవకాడో నూనెతో ముఖంలో సహజమైన నిగారింపు.. ఇంట్లోనే చేసుకోండిలా!-diy avocado oil for skin here is stepwise process to make this oil at home benefits and uses ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy Avocado Oil For Skin | అవకాడో నూనెతో ముఖంలో సహజమైన నిగారింపు.. ఇంట్లోనే చేసుకోండిలా!

DIY Avocado Oil for Skin | అవకాడో నూనెతో ముఖంలో సహజమైన నిగారింపు.. ఇంట్లోనే చేసుకోండిలా!

HT Telugu Desk HT Telugu
Aug 02, 2023 04:01 PM IST

DIY Avocado Oil for Skin: అవకాడో ఆయిల్ మీ చర్మానికి అనేక ప్రయోజనాలను అందించే అద్భుతమైన సహజ లక్షణాలను కలిగి ఉంది.

DIY Avocado Oil for Skin
DIY Avocado Oil for Skin (istock)

DIY Avocado Oil for Skin: ముఖం తెల్లగా మెరిసిపోవాలని చాలా మంది కోరుకుంటారు, ఇందుకు ఫెయిర్ నెస్ క్రీములు, ఫేషియల్స్ అంటూ చాలా ఖర్చు చేస్తారు. కానీ, ముఖం ఆరోగ్యంగా సహజ రంగులో ప్రకాశించడమే నిజమైన అందం. ఇందుకోసం మీ ఎలాంటి కాస్స్మెటిక్ ఉత్పత్తులు కొనవలసిన అవసరం లేదు, ఇంట్లో ఉపయోగించే కొన్ని సహజ పదార్థాలతోనే అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మీ చర్మానికి మేలు చేసే పదార్థాలతో అవకాడో కూడా ఒకటి. ముఖ్యంగా అవకాడో ఆయిల్ మీ చర్మానికి అనేక ప్రయోజనాలను అందించే అద్భుతమైన సహజ లక్షణాలను కలిగి ఉంది.

ఈ నూనెలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి, అవకాడో నూనె చర్మానికి పోషణ, హైడ్రేషన్, పునరుజ్జీవనం అందిస్తుంది. అవోకాడో ఆయిల్ ఒక సహజ మాయిశ్చరైజర్, చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది, మృదువైన నిగారింపును ఇస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న అవకాడో నూనె వృద్ధాప్య ఛాయలను కూడా దూరం చేయడంలో సహాయపడుతుంది. చర్మం యవ్వనంగా ఉంచుతుంది, మెరిసే మేనిఛాయను అందిస్తుంది.

అవోకాడో నూనెను మీకు మీరుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ నూనెను ఎలా తయారు చేయాలి అలాగే ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కోసం అవకాడో నూనెను ఉపయోగించే వివిధ మార్గాలను ఇక్కడ పరిశీలించండి.

ఇంట్లో అవోకాడో నూనెను ఎలా తయారు చేయాలి?

దశ 1: మీ ఇంట్లో తయారుచేసిన అవోకాడో నూనెను తయారు చేయడానికి మీకు పండిన అవకాడోలు, కత్తి, ఒక చెంచా, బ్లెండర్ లేదా ఫుడ్ ప్రాసెసర్ , చక్కటి మెష్ స్ట్రైనర్ లేదా చీజ్‌క్లాత్ అవసరం.

దశ 2: అవోకాడో గుజ్జును సంగ్రహించండి

పండిన అవకాడోలను సగానికి ముక్కలు చేసి ఒక చెంచాతో గుజ్జును బయటకు తీయండి. అనంతరం దానిని బ్లెండర్ లేదా ఫుడ్ ప్రాసెసర్‌లోకి బదిలీ చేయండి.

దశ 3: బ్లెండ్ చేయండి

అవకాడో ముక్కలు లేదా గుజ్జు మృదువైన క్రీమీ పదార్థంగా మారే వరకు బ్లెండ్ చేయండి. . బ్లెండింగ్ ప్రక్రియలో అవకాడో నుంచి నూనెను విడుదల చేయడానికి సహాయపడుతుంది.

దశ 4: నూనెను వేరు చేయండి

గ్రైండ్ చేయగా విడుదలైన అవకాడో నూనె మిశ్రమాన్ని శుభ్రపరచిన గిన్నె లేదా కంటైనర్ లో ఫిల్టర్ చేయండి. ఒక చెంచాను ఉపయోగించి నొక్కుతూ నూనెను బయటకు తీయండి.

దశ 5: నూనెను నిల్వ చేయండి

సేకరించిన అవోకాడో నూనెను ముదురు రంగు గాజు సీసా లేదా కంటైనర్‌లోకి బదిలీ చేయండి. చల్లని, చీకటి ప్రదేశంలో నిల్వ చేయండి. ఇంట్లో తయారుచేసిన అవోకాడో నూనెను సరిగ్గా నిల్వ చేస్తే కొన్ని వారాల పాటు ఉంటుంది.

నిల్వచేసుకున్న అవకాడో నూనెను మీకు అవసారమైనపుడు వాడుకోవచ్చు. చర్మానికి మాయిశ్చరైజర్ గా, లిప్ బామ్ గా, మేకప్ రిమూవర్ గా ఉపయోగించవచ్చు. సాధారణంగా అవకాడో నూనె ఎలాంటి చర్మ రకానికైనా సురక్షితమైనదే. ఒకవేళ మీకు చర్మ సమస్యలు ఉంటే డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్టులను సంప్రదించండి.

సంబంధిత కథనం