Ridge Gourd Okra Curry । బీరకాయ బెండకాయ కూర.. కలిపి చేసుకుంటే వారే వాహ్!
Ridge Gourd Okra Curry Recipe: బీరకాయ, బెండకాయ రెండు కూరగాయలను కలిపి బీరకాయ బెండకాయ కూరగా వండుకోవచ్చు. మీకోసమే ఇప్పుడు ఈ ప్రత్యేకమైన రెసిపీని అందిస్తున్నాం.
Healthy Summer Recipes: మీరు ఇప్పటివరకు చాలా సార్లు బీరకాయ కూరను తిని ఉంటారు, బెండకాయ కూరను తిని ఉంటారు. కానీ, ఎప్పుడైనా ఈ రెండు కూరగాయలను కలిపేసి, ఒక్కచోటనే బీరకాయ బెండకాయ కూరగా వండుకొని తిన్నారా? మీకోసమే ఇప్పుడు ఈ రెసిపీని పరిచయం చేస్తున్నాం. బీరకాయ బెండకాయ కూర అనేది గోవా వంటకాల్లో గుండెకాయ లాంటిది. దీనిని అక్కడ మెయిన్ కోర్స్ భోజనంలో సైడ్ డిష్ గా వడ్డిస్తారు.
ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతుంది. ఈ మండు వేసవిలో వేడిని అధిగమించడానికి మీ భోజనంలో తేలికపాటి, రిఫ్రెష్ వంటకాలు ఉండాలి. ముఖ్యంగా తాజా కూరగాయలను ఎక్కువగా తినాలి. బెండకాయలో విటమిన్ ఎ, బి, సి కె, ఇ వంటి విటమిన్లతో పాటు పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బీరకాయ నీటిశాతం అధికంగా ఉండే కూరగాయ. ఇందులో క్యాలరీలు తక్కువ ఉంటాయి, పొషకాలు ఎక్కువ ఉంటాయి. విటమిన్లకు మినరల్స్ కు బీరకాయ పవర్‌హౌస్.
ఇన్ని పోషకాలు నిండిన బీరకాయ బెండకాయ కూర ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Ridge Gourd Okra Curry Recipe కావలసినవి
- 450 గ్రాముల బీరకాయ
- 200 గ్రాముల బెండకాయ
- 1 ఉల్లిపాయ
- 2 పచ్చిమిర్చి
- 1 టమోటా
- 4 కోకుమ్ రేకులు లేదా కొద్దిగా చింతపండు (ఐచ్ఛికం)
- 1/2 కప్పు తురిమిన కొబ్బరి
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- ఉప్పు రుచికి తగినంత
బీరకాయ బెండకాయ కూర తయారీ విధానం
- ముందుగా బీరకాయలను, బెండకాయలు, ఇతర కూరగాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
- మొదటగా బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
- ఉల్లిపాయ కొద్దిగా రంగు మారాక, టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేలా ఉడికించాలి.
- ఇప్పుడు బీరకాయ, బెండకాయ ముక్కలు వేయాలి. అలాగే కొద్దిగా చింతపండు, ఉప్పు వేసి అన్నింటిని బాగా కలపండి. నీరు కలపకూడదు.
- ఇప్పుడు మూతపెట్టి మీడియం మంట మీద ఉడికించాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. కూరగాయలు ఉడికేంత వరకు ఉడికించాలి.
- చివరగా కొబ్బరి తురుము, కొత్తిమీర చల్లుకోవచ్చు.
అంతే, బీరకాయ బెండకాయ కూర రెడీ. అన్నంతో అయినా, చపాతీతో అయినా తింటే అద్భుతంగా ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్