Yaathisai Movie: ఓటీటీలో రిలీజైన తర్వాత థియేటర్లలోకి వస్తోన్న పీరియాడికల్ మూవీ - బాహుబలికి పోటీ అన్నారు కానీ
Yaathisai Movie: తమిళ మూవీ యాతిసై తెలుగు డబ్బింగ్ వెర్షన్ మే 10న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ హిస్టారికల్ తమిళ మూవీ గత ఏ డాది ఓటీటీలో రిలీజైంది.
Yaathisai Movie: థియేటర్లలో రిలీజైన తర్వాత ఓటీటీలో సినిమాలను రిలీజ్ చేయడం కామన్‌గా కనిపించే రూల్. కానీ దీనికి భిన్నంగా తమిళ మూవీ యాతిసై మాత్రం ఓటీటీలో రిలీజైన తర్వాత థియేటర్లలోకి వస్తోంది. యాతిసై తెలుగు, హిందీ రిలీజ్ డేట్స్‌ను సినిమా యూనిట్ సోమవారం ప్రకటించింది.
మే 10న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండ తెలుగు, హిందీ భాషలకు సంబంధించి రెండు వేర్వేరు టీజర్స్‌ను రిలీజ్ చేశారు. యుద్ధ సన్నివేశాలు, పాండ్య రాజులను ఎదురించి అసమాన పోరాటం చేసిన ఓ తెగ జీవితాల నేపథ్యంలో ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది.
అమెజాన్ ప్రైమ్‌లో...
తమిళంలో యాతిసై మూవీ గత ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలై నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. 2023 మే నెలలోనే తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఓటీటీలో రిలీజైన ఏడాది తర్వాత తెలుగు వెర్షన్‌ను థియేటర్లలో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. తెలుగుతో పాటు హిందీలో ఒకే రోజు థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అందరూ కొత్తవాళ్లే...
హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాతో పలువురు కొత్త నటీనటులు కోలీవుడ్‌కు పరిచయమ్యారు. శక్తి మిత్రన్, సియోన్, రాజలక్ష్మి, గురు సోమసుందరం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ధరణి రాసేంద్రన్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ధరణిని ఇదే మొదటి మూవీ. ఈ సినిమాలోని డైలాగ్స్ మొత్తం గ్రాంథిక తమిళంలో రాశారు.
బాహుబలికి పోటీ అన్నారు...
టీజర్స్, ట్రైలర్స్ రిలీజైన తర్వాత కోలీవుడ్ వర్గాల యాతిసై మూవీని బాహుబలితో పోల్చారు. కానీ ఈ సినిమా బాహుబలికి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఏడు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 20 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. బడ్జెట్, టెక్నికల్ అంశాలపై దారుణంగా విమర్శలొచ్చాయి. ఇందులోని మేకప్‌లను ట్రోల్ చేశారు. అయితే యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్‌లను మాత్రం అలరించాయి.
యాతిసై స్టోరీ ఏదంటే?
పాండ్య రాజు రణధీర పాండ్యన్‌పై పగను పెంచుకుంటాడు కోతి అనే పోరాట యోధుడు . తనకంటే ఎన్నో రెట్లు బలవంతుడైన రణధీరపై తక్కువ సైన్యంతో కోతి ఎలాంటి పోరాటం చేశాడు? ఈ యుద్ధంలో రణధీరను కోతి ఓడించాడా? లేదా ? అన్నదే ఈ మూవీ కథ. హలీవుడ్ మూవీ 300 తో పాటు పలువుడు హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో యాతిసై మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలోని ఒక్కో యాక్షన్ ఎపిసోడ్‌ను పది నిమిషాలకుపైనే చిత్రీకరించాడు డైరెక్టర్.