Sai Pallavi: రియ‌ల్ లైఫ్ వెన్నెల కుటుంబ‌సభ్యులతో రీల్ లైఫ్ వెన్నెల-virataparvam team met thumu sarala family members ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Pallavi: రియ‌ల్ లైఫ్ వెన్నెల కుటుంబ‌సభ్యులతో రీల్ లైఫ్ వెన్నెల

Sai Pallavi: రియ‌ల్ లైఫ్ వెన్నెల కుటుంబ‌సభ్యులతో రీల్ లైఫ్ వెన్నెల

Nelki Naresh Kumar HT Telugu
Jun 13, 2022 07:33 PM IST

1990 నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రానా,సాయిప‌ల్ల‌వి జంట‌గా రూపొందిన చిత్రం విరాట‌ప‌ర్వం. తూము స‌ర‌ళ అనే న‌క్స‌ల్ నాయ‌కురాలిగా జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఆదివారం తూము స‌ర‌ళ కుటుంబ‌స‌భ్యుల‌ను విరాట‌ప‌ర్వం టీమ్ క‌లిసింది. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి

<p>&nbsp;సాయిప‌ల్ల‌వి</p>
సాయిప‌ల్ల‌వి (twitter)

న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్‌కు ప్రేమ‌క‌థ‌ను జోడిస్తూ రూపొందిన చిత్రం విరాట‌ప‌ర్వం. రానా,సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జూన్ 17న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రిలీజ్‌కానుంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం ఆత్మీయ వేడుక పేరుతో చిత్ర‌బృందం వ‌రంగ‌ల్‌లో ఓ ప్ర‌చార వేడుక‌ను నిర్వ‌హించింది.

yearly horoscope entry point

ఈ కార్య‌క్ర‌మానికి రానా,సాయిప‌ల్ల‌వితో పాటు యూనిట్ మొత్తం హాజ‌ర‌య్యారు. కాగా ఈ సినిమా వ‌రంగ‌ల్‌కు చెందిన తూము స‌ర‌ళ అనే మ‌హిళా న‌క్స‌లైట్ జీవితం ఆధారంగా రూపొందుతోంది. ఆమె లైఫ్‌లో ఎదురైన సంఘ‌ట‌న‌ల‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను జోడిస్తూ ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆదివారం తూము స‌ర‌ళ కుటుంబ‌స‌భ్యుల‌ను విరాట‌ప‌ర్వం టీమ్ క‌లిసింది. వారితో క‌లిసి కొద్ది సేపు ముచ్చ‌టించింది.

ఈ ఫొటోల‌ను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ట్విట్ట‌ర్ లో షేర్ చేసింది. ఇందులో స‌ర‌ళ‌ త‌ల్లితో సాయిప‌ల్ల‌వి ముచ్చ‌టిస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. త‌న కూతురు పాత్ర‌ను చేస్తున్న సాయిప‌ల్ల‌విని చూసి స‌ర‌ళ త‌ల్లి భావోద్వేగానికి లోనైన‌ట్లుగా స‌మాచారం. వ‌రంగ‌ల్‌కు చెందిన ఓ మ‌హిళ జీవితంలో చోటు చేసుకున్న షాకింగ్ సంఘ‌ట‌న‌ల‌తో విరాట‌ప‌ర్వం సినిమాను తెర‌కెక్కించామ‌ని చిత్ర యూనిట్ ఈ ఫొటోలను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.. విప్ల‌వంలో కూడా ప్రేమ భావాల‌ను ర‌గిల్చిన అమ్మాయికి ప్ర‌తీక‌గా సాయిప‌ల్ల‌వి వెన్నెల పాత్ర ఉంటుందని తెలిపింది విరాట‌ప‌ర్వం సినిమాలో ప్రియ‌మ‌ణి,న‌వీన్‌చంద్ర,నందితాదాస్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం