Krithi Shetty: కృతి శెట్టితో రొమాన్స్ చేయను.. ఫొటో చూసి బేబమ్మను రెజెక్ట్ చేసిన విజయ్-vijay sethupathi reveals why he refuse to romance with krithi shetty ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krithi Shetty: కృతి శెట్టితో రొమాన్స్ చేయను.. ఫొటో చూసి బేబమ్మను రెజెక్ట్ చేసిన విజయ్

Krithi Shetty: కృతి శెట్టితో రొమాన్స్ చేయను.. ఫొటో చూసి బేబమ్మను రెజెక్ట్ చేసిన విజయ్

Sanjiv Kumar HT Telugu
Sep 27, 2023 12:58 PM IST

Krithi Shetty Vijay Sethupathi: ఉప్పెన సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన బ్యూటిఫుల్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే బీభత్సమైన పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మతో రొమాన్స్ చేయనని తెగేసి చెప్పాడట మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.

కృతి శెట్టితో రొమాన్స్ చేయను.. ఫొటో చూసి బేబమ్మను రెజెక్ట్ చేసిన విజయ్
కృతి శెట్టితో రొమాన్స్ చేయను.. ఫొటో చూసి బేబమ్మను రెజెక్ట్ చేసిన విజయ్

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతోమంది ముద్దుగుమ్మలు పరిచయం అవుతుంటారు. అలాంటి వారిలో ఒకరే తుళు అందం కృతి శెట్టి. ముంబైలో సెప్టెంబర్ 21, 2003లో పుట్టిన కృతి శెట్టి కర్ణాటక మంగుళూరులోని తుళు కుటుంబానికి చెందినది. కృతి తండ్రి బిజినెస్ మ్యాన్ కాగా.. తల్లి ఫ్యాషన్ డిజైనర్. ఇదిలా ఉంటే తెలుగులో ఉప్పెన సినిమాతో పరిచయమైన కృతి శెట్టి ఫస్ట్ మూవీతోనే హ్యూజ్ పాపులారిటీ సొంతం చేసుకుంది.

హిట్స్-ప్లాప్స్

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాలో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోయే పాత్రలో కృతి శెట్టి ఆకట్టుకుంది. తొలి సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృతి శెట్టికి ఆ తర్వాత మాత్రం కొన్ని హిట్స్ పడగా.. ఎక్కువగా అపజయాలే ఎదురయ్యాయి. శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఘోరంగా విఫలం అయ్యాయి.

హిట్ కొట్టాలని

ప్రస్తుతం ఎలాగైనా హిట్ కొట్టాలని కృతి శెట్టి ఉవ్విల్లూరుతోంది. అందులో భాగంగానే ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒక్కో సినిమా చేస్తుందట కృతి శెట్టి. అయితే ఇదివరకు ఓ సినిమాలో కృతి శెట్టితో రొమాన్స్ చేసేందుకు తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తిరస్కరించాడట. కృతిని వద్దనడానికి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు విజయ్ సేతుపతి.

రొమాంటిక్‍గా చేయలేను

"ఉప్పెన సినిమాలో బేబమ్మకు (కృతి శెట్టి) తండ్రిగా నటించాను. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత నేను తమిళంలో ఓ సినిమాకు సైన్ చేశాను. అందులో నాకు జోడీగా కృతి శెట్టి అయితే బాగుంటుందని మేకర్స్ భావించారట. హీరోయిన్ ఈవిడే అంటూ నాకు తన ఫొటో పంపించారు. అది చూసిన వెంటనే మూవీ యూనిట్‍ను పిలిచి వద్దని చెప్పాను. తండ్రిగా నటించిన ఆమెతే రొమాంటిక్‍గా నటించడం నాకిష్టం లేదు. అందుకే హీరోయిన్‍గా తనను వద్దని చెప్పాను" అని విజయ్ చెప్పుకొచ్చారు.

విలన్‍గా మెప్పించి

కాగా తమిళం, తెలుగు, బాలీవుడ్ అంటూ చిత్రాలతో దూసుకుపోతున్నారు విజయ్ సేతుపతి. ఇటీవల జవాన్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ రోల్ చేసి మెప్పించారు. ప్రస్తుతం మహారాజ, మేరీ క్రిస్‍మస్, గాంధీ టాక్స్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు విజయ్ సేతుపతి.

Whats_app_banner