Vijay Antony OTT Movies: విజ‌య్ ఆంటోనీ డ‌బుల్ ట్రీట్ - ఒక్క రోజు గ్యాప్‌లో ఓటీటీలో రెండు సినిమాలు రిలీజ్‌-vijay antony tamilarasan and bichagadu 2 movies ott release dates fixed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Antony Ott Movies: విజ‌య్ ఆంటోనీ డ‌బుల్ ట్రీట్ - ఒక్క రోజు గ్యాప్‌లో ఓటీటీలో రెండు సినిమాలు రిలీజ్‌

Vijay Antony OTT Movies: విజ‌య్ ఆంటోనీ డ‌బుల్ ట్రీట్ - ఒక్క రోజు గ్యాప్‌లో ఓటీటీలో రెండు సినిమాలు రిలీజ్‌

HT Telugu Desk HT Telugu
Jun 10, 2023 12:29 PM IST

Vijay Antony OTT Movies: ఒక్క రోజు గ్యాప్‌లో విజ‌య్ ఆంటోనీ న‌టించిన రెండు సినిమాలు ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే..

త‌మిళ‌రాస‌న్ మూవీ
త‌మిళ‌రాస‌న్ మూవీ

Vijay Antony OTT Movies: అభిమానుల‌కు విజ‌య్ ఆంటోనీ డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నాడు. ఒక్క రోజు గ్యాప్‌లో అత‌డు న‌టించిన రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన త‌మిళ‌రాస‌న్ జీ5 ఓటీటీలో జూన్ 16న రిలీజ్ కానుండ‌గా, బిచ్చ‌గాడు 2 మూవీ జూన్ 17న డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కాబోతున్న‌ది.

తొలుత బిచ్చ‌గాడు 2 సినిమాను జూన్ 23న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అనుకున్న తేదీ కంటే వారం ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్న‌ది. బిచ్చ‌గాడు -2 మూవీ తెలుగుతో పాటు త‌మిళంలో బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

తెలుగులో ఈ మూవీ 18 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. నిర్మాత‌ల‌కు నాలుగు కోట్ల వ‌ర‌కు లాభాల్ని మిగిల్చింది. త‌మిళంలో 17 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాతోనే డైరెక్ట‌ర్‌గా అరంగేట్రం చేశాడు.

బిచ్చ‌గాడు 2 మూవీలో కావ్య థాఫ‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. బిచ్చ‌గాడు -2కి కొన‌సాగింపుగా బిచ్చ‌గాడు -3ని కూడా తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు విజ‌య్ ఆంటోనీ ప్ర‌క‌టించాడు. కాగా త‌మిళ‌రాస‌న్ సినిమా ఏప్రిల్ 22న థియేట‌ర్ల‌లో రిలీజైంది. సురేష్‌గోపి, సోనూసూద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను ద‌క్కించుకొంది.

తాజాగా ఈ రెండు సినిమాలు ఒక్క‌రోజు గ్యాప్‌లో ఓటీటీ ప్రేక్ష‌క‌లు ముందుకు రానుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. కాగా బిచ్చ‌గాడు -2 సినిమాలో హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా, ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు విజ‌య్ ఆంటోనీ. అత‌డి స‌తీమ‌ణి ఫాతిమా విజ‌య్ ఆంటోనీ ఈ మూవీని నిర్మించింది.

IPL_Entry_Point