Bhairavi Serial: సోషియో ఫ్యాంటసీ సీరియల్ ‘భైరవి’ వచ్చేస్తోంది.. ఛానెల్‍, టైమింగ్స్ వివరాలివే-tv news bhairavi serial set to telecast from march 18 on gemini tv channel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhairavi Serial: సోషియో ఫ్యాంటసీ సీరియల్ ‘భైరవి’ వచ్చేస్తోంది.. ఛానెల్‍, టైమింగ్స్ వివరాలివే

Bhairavi Serial: సోషియో ఫ్యాంటసీ సీరియల్ ‘భైరవి’ వచ్చేస్తోంది.. ఛానెల్‍, టైమింగ్స్ వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 15, 2024 06:21 PM IST

Bhairavi New Serial: భైరవి సీరియల్ టెలికాస్ట్ అయ్యేందుకు రెడీ అయింది. ఈ సీరియల్ ప్రారంభ తేదీ, ప్రసార సమయం కూడా ఖరారయయ్యాయి. ఆ వివరాలు ఇవే..

Bhairavi Serial: సోషియో ఫ్యాంటసీ సీరియల్ ‘భైరవి’ వచ్చేస్తోంది
Bhairavi Serial: సోషియో ఫ్యాంటసీ సీరియల్ ‘భైరవి’ వచ్చేస్తోంది

Bhairavi Serial: టీవీ ఛానెళ్లలో కొత్త సిరీయల్స్ వివిధ జానర్లలో అడుగుపెడుతున్నాయి. ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో కొత్తగా మరో సూపర్ నేచురల్ సోషియో ఫ్యాంటసీ సీరియల్ ప్రసారం కానుంది. ‘భైరవి’ పేరుతో ఈ సీరియల్ వస్తోంది. ఇటీవలే వచ్చిన ఈ సిరీయల్ ప్రోమో ఆసక్తిని రేపింది. భైరవి సీరియల్ ప్రారంభ తేదీ, టెలికాస్ట్ టైమింగ్‍లను జెమినీ టీవీ వెల్లడించింది.

టైమింగ్స్ ఇవే

భైరవి సీరియల్ మార్చి 18వ తేదీన జెమినీ టీవీలో ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతీ రోజు రాత్రి 7 గంటలకు ఈ సీరియల్ ప్రసారం అవుతుంది. సరికొత్త కథతో.. థ్రిల్లింగ్ అంశాలతో ఈ సోషియో ఫ్యాంటసీ సీరియల్ తీసుకొస్తున్నామని జెమినీ టీవీ పేర్కొంది.

భైరవి సీరియల్‍లో ఆకాంక్ష గాంధీ, బేబి రచన, భరద్వాజ్, బసవరాజ్, వణ పొన్నప్ప, రోహిత్ డాలీ, శిల్ప గౌడ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

భైరవి సీరియల్ స్టోరీ బ్యాక్‍డ్రాప్ ఇదే

భైరవి అనే పాపను ఆస్తి కోసం బాబాయి చంపేయడం.. కొన్నాళ్లకు ఆమె మళ్లీ తిరిగి వచ్చి ప్రతీకారం తీర్చుకోవడం.. తన కుటుంబాన్ని చక్కదిద్దడం చుట్టూ భైరవి సీరియల్ ఉండనుంది. ఓ సంపన్న కుటుంబానికి భైరవి దేవీ.. ఇంటి దేవతగా ఉంటారు. ఆ ఇంట్లో పుట్టిన ఏకైక ఆడిపిల్లకు భైరవి అని అమ్మవారి పేరు పెడుతారు తల్లి శివగామి. అయితే, ఆస్తిపై భైరవి చిన్నాన్న కన్నేస్తాడు. కుట్రలు పన్నుతాడు. ఆస్తి కోసం భైరవిని ఆది చంపేస్తాడు. ఆ తర్వాత శివగామి పిచ్చిది అని ప్రపంచాన్ని నమ్మిస్తాడు ఆది. ఆస్తులు, వ్యాపారాలను చేజిక్కుచుకుంటాడు. వ్యాపారంలో భారీగా ఎదుగుతాడు. అయితే, ఊహించని విధంగా కొన్నాళ్లకు భైరవి తిరిగి వస్తుంది. భైరవి ఎలా తిరిగి వచ్చింది? ఆమె ఆత్మనా లేకపోతే అమ్మవారు ఆవహించిందా? తనను అంతం చేసి, తన తల్లి శివగామిని మతిస్థిమితం లేని వ్యక్తిగా చేసిన వారిపై ఎలా పగతీర్చుకుంటుంది? తన తల్లిని ఎలా కాపాడింది? అనేదే భైరవి సీరియల్ స్టోరీ బ్యాక్‍డ్రాప్‍గా ఉంది.

తమ చిన్నాన్న చాలా డేంజర్ అని, తాతతో కలిసి తనను చంపేశారని భైరవి చెబుతున్నట్టుగా ఈ సీరియల్ ప్రోమో వచ్చింది. ఆ తర్వాత ఆత్మగా మారిన భైరవి పోలీసులకు కనిపిస్తారు. అయితే, ఆమె దెయ్యం కాదని, దేవత అంటూ ఓ పోలీస్ ఆఫీసర్ దండం పెడతారు. అలాగే, మరో ప్రోమో కూడా తాగా రిలీజ్ అయింది. ఓ అమ్మాయిని చంపేందుకు ఓ వ్యక్తి ప్లాన్ చేస్తాడు. దగ్గరికి వెళ్లి చెప్పి మరీ గన్‍తో కాల్చాలని రౌడీకి సూచిస్తాడు. ఇంతలోనే ఓ జీపుతో వచ్చి ఆ రౌడీని ఢీకొడుతుంది భైరవి. అయితే, ఆ కారులో డ్రైవర్ లేరని అక్కడి వారు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత జీపుపైకి వచ్చి భైరవి కూర్చుంటారు. దెయ్యమా, దేవతా అని అక్కడి వారు ఆశ్చర్యపోతారు. ‘దెయ్యాన్ని నేనే, దేవతను నేనే’ అనే డైలాగ్ చెబుతారు భైరవి. మొత్తంగా ప్రోమోలతో భైరవి సిరీయల్‍పై ఆసక్తి నెలకొంది.

Whats_app_banner