Bigg Boss 6 Sixth week Nominations: ఈ వారం హీటెడ్ నామినేషన్లు.. ఆదిరెడ్డి-రోహిత్ ఫైట్.. కొట్టుకునేంత గొడవ!-these are the contestants who nominated in bigg boss 6 telugu sixth week nominations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Sixth Week Nominations: ఈ వారం హీటెడ్ నామినేషన్లు.. ఆదిరెడ్డి-రోహిత్ ఫైట్.. కొట్టుకునేంత గొడవ!

Bigg Boss 6 Sixth week Nominations: ఈ వారం హీటెడ్ నామినేషన్లు.. ఆదిరెడ్డి-రోహిత్ ఫైట్.. కొట్టుకునేంత గొడవ!

Maragani Govardhan HT Telugu
Oct 11, 2022 06:59 AM IST

Bigg Boss 6 Telugu Episode 37: ఈ వారం నామినేషన్లు వాడీ వేడిగా జరిగాయి. రోహిత్, ఆదిరెడ్డి కొట్టుకునేంత వరకు వెళ్లారు. ఈ వారం 9 మంది నామినేషన్‌లో ఉన్నారు. కీర్తి, ఆదిరెడ్డి, గీతూ, ఆదిరెడ్డి, సుదీప, శ్రీహాన్, రాజ్, శ్రీసత్య, మెరీనా నామినేట్ అయ్యారు.

<p>బిగ్‌బాస్ ఆరో వారం నామినేషన్లు</p>
బిగ్‌బాస్ ఆరో వారం నామినేషన్లు

Bigg Boss 6 Telugu Day 36 Episode 37: సోమవారం వచ్చిందంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో వాతావరణం ఇంటి సభ్యుల నామినేషన్లు, వాదనలతో వేడిగా మారిపోతుంటుంది. గత వారం చప్పగా సాగిన నామినేషన్ ప్రక్రియ ఈ వారం మాత్రం ఓ రేంజ్‌లో సాగింది. ఎప్పుడూ కూల్‌గా ఉండేవారు కూడా వాయిస్ పెంచి మాట్లాడటం.. సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చినవాళ్లు కూడా తమ వాదనను బహిరంగంగా వినిపించాల్సిందే. తాజాగా ఈ సోమవారం కూడా బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్లతో హీట్ పెరిగింది.

ఎపిసోడ్ ప్రారంభంలోనే రివ్యూవర్లుగా హౌస్‌లోకి అడుగుపెట్టిన గీతూ, ఆదిరెడ్డి తమ రివ్యూలను ఎప్పటిలాగానే కొనసాగిస్తున్నారు. వాసంతి అంటే రేవంత్‌కు ఇంట్రస్ట్ ఉందంటూ ఆదిరెడ్డికి చెబుతుంది గీతూ. అక్కడకు వచ్చిన అర్జున్ కూడా అవునంటూ ఆమెకు వంత పాడతాడు. అతడు వేరేవాళ్లను లింగ్ చేస్తే జోక్.. మనం చేస్తే మాత్రం సీరియస్ అవుతాడని అంటాడు. అయితే ఇక్కడ కామెడీ ఏంటంటే.. ట్రాయాంగిల్ లవ్ స్టోరీ కంటెంట్ వస్తుందని వాసంతికి చెప్పిందే అర్జున్.. కానీ అనవసరంగా రేవంత్‌కు లింక్ చేస్తున్నాడనిపిస్తుంది. నేను శ్రీ సత్య వెంటే పడతాను.. నువ్వు నా వెంట పడుతుంటే బోలెడంత కంటెంట్ వస్తుందని చెప్పడం ఇంతకుముందు చెబుతాడు. మరి ఇప్పుడు రేవంత్‌పై నిందలు వేయడమేంటో అర్థం కావట్లేదు.

కోటిసార్లు తిరిగిచ్చేస్తా-రేవంత్..

అనంతరం ఇద్దరు ఇంటి సభ్యుల ముఖంపై ఫోమ్ పూసి నామినేషన్ ప్రక్రియను ప్రారంభించాలని బిగ్‌బాస్ ఆదేశిస్తారు. ముందుగా కెప్టెన్ రేవంత్.. సుదీప, బాలాదిత్యలను నామినేట్ చేశాడు. అయితే సుదీపతో రేవంత్‌కు హీటెడ్ ఆర్గ్యూమెంట్ జరుగుతుంది. తనది తప్పు కాదని.. వంద సార్లయినా నొక్కి చెబుతానని సుదీప అనగా.. నేను కోటి సార్లయినా చెబుతానని రేవంత్ కౌంటర్ ఇస్తాడు. అనంతరం ఆదిరెడ్డి.. మెరీనాను నామినేట్ చేస్తూ.. ఫైమా కంటే మీ గేమ్ తక్కువగా ఉందని నాకనిపించిందని, హౌస్‌లో గేమ్ ఉండాలే తప్ప మంచితనంతో ఉండకూడదని చెబుతాడు. ఓవర్ థింకింగ్ చేస్తున్నావని కీర్తిని నామినేట్ చేశాడు.

రోహిత్-ఆదిరెడ్డి ఫైట్.. కొట్టుకునేవరకు వెళ్లారు..

మెరీనా.. తనను ఆదిరెడ్డి నామినేట్ చేయడంతో తిరిగి అతడిని నామినేట్ చేయడంతో గొడవ ప్రారంభమైంది. బై వన్ గెట్ టూ ఆఫర్ ఇచ్చారు కదండి.. ఒకరికేస్తే.. ఇద్దరూ(మెరీనా, రోహిత్) వచ్చేశారు అని ఆదిరెడ్డి అంటాడు. దీంతో మెరీనా.. మీకు చాలా అనిపిస్తాయి.. కానీ నేను నామినేట్ చేస్తున్న రీజన్ అది కాదు. అసలు మీరు కెప్టెన్‌గా సక్సెస్ అయ్యారని అనుకుంటున్నారా? అని అడిగింది. దీంతో ఆదిరెడ్డి నేను పనిష్మెంట్ ఇవ్వడం వరకే ఫెయిల్ అయ్యాను.. మిగతా అన్నీ విషయాల్లో సక్సెస్ అయ్యాను అని అన్నాడు ఆదిరెడ్డి. కిచెన్‌లో ఇద్దరం ఇబ్బంది పడుతుంటే మీరు ఏం చేశారు? అడిగినా సరే చేయలేదు కదా అని అన్నది మెరీనా. దీంతో ఆదిరెడ్డి మీరు అప్పుడు అడగాలి కదా.. నాగార్జున చెప్పినట్లు నేను కెప్టెన్‌గా ఫెయిల్ అయిన మాట వాస్తవమే.. కానీ మీ ఇద్దరితో జరిగిన పాయింట్‌లో తప్పు మీదే నాది కాదు అని గట్టిగా అరిచాడు. దీంతో రోహిత్.. నేను మాట్లాడొచ్చా?? అంటూ సీన్‌లో ఎంట్రీ ఇచ్చాడు. శుక్ర, శనివారాల్లో రూల్ ఏంటి? అని అడిగాడు. ఆ మాటతో ఆదిరెడ్డి బ్రో నేను చెప్పేది మీకు అర్థం కాలేదా? అని గట్టిగా అన్నాడు. అందుకు రోహిత్ నువ్వు వాయిస్ రెయిజ్ చేస్తే నేనూ చేస్తా అని గట్టిగా అరిచాడు. ఆ మాటతో ఆదిరెడ్డి అయితే రెయిజ్ చేయ్.. అని రోహిత్‌పైకి దూసుకొచ్చాడు. నీ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడు.. వైఫ్‌తో కలిసి ఆడటం కాదు.. అంటూ రెచ్చిపోయాడు.

నేను చెప్పేది విను అని రోహిత్ అనడంతో.. అక్కడే నిలబడి మాట్లాడు అని ఆదిరెడ్డి అన్నాడు. ఫస్ట్ నువ్వు నీ ప్లేస్‌లోకి వెళ్లి నిలబడు అని అన్నాడు రోహిత్. నేను బ్యాక్‌కు వెళ్తానో ఏం చేస్తానో.. నామినేట్ చేయకూడదా? నామినేట్ చేస్తే అంత కోపం వస్తుందా? ఏం మాట్లాడుతున్నారు అంటూ మళ్లీ దూసుకుని వచ్చాడు ఆదిరెడ్డి. దీంతో రోహిత్ కళ్లు పెద్దవి చెస్తూ.. నామినేట్ చేయమని చెప్పడానికి మీరెవరు? అంటూ పెద్ద పెద్ద కళ్లు చేస్తూ ఆదిరెడ్డిని కొట్టడానికి వెళ్లాడు. ఆదిరెడ్డి కూడా రోహిత్ మీదకు దూసుకుని రావడంతో వీళ్లిద్దరూ కొట్టుకునేంత వరకు వచ్చేసింది.

వైఫ్ ఉంది సపోర్ట్ చేస్తున్నాడు అని ఆ మాటలు ఏంటి? అని రోహిత్ సీరియస్ అయ్యాడు. ఆ పాయింట్‌కు మీరు ఒప్పుకోండి.. మీరు ఇద్దరూ కలిస ఆడుతున్నారు అని ఆదిరెడ్డి అన్నాడు. చివరకు వీళ్లు మాట్లాడనీయరు.. నువ్వు నామినేట్ చేసి వచ్చేయ్.. అని రోహిత్ మెరీనాకు చెప్పాడు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని ఆదిరెడ్డికి మెరీనా చురకలంటించింది.

ఈ చర్చలో మెరీనా-రోహిత్ కలిసి ఆదిరెడ్డి నామినేట్ చేశారనేది వాస్తవనే. అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్ చేయడం లేదని అందరూ అతడిని నామినేట్ చేశారు. అయితే వీళ్లు ఏమైనా గొప్ప ఎంటర్టైనర్లా అంటే.. అదీ లేదు. ఫైమా కంటే మెరీనా బాగా గేమ్ ఆడుతుందని హీట్ చేసేటంత.. అలాంటి వాళ్లు ఆదిరెడ్డిని ఎంటర్టైన్ చేయడం లేదని నామినేట్ చేయడం కొంచెం కామెడీగా ఉంది. అయితే ఆదిరెడ్డి కొంచెం నిదానంగా మాట్లాడిల్సింది. రోహిత్‌పైకి వెళ్లడం, గట్టిగా మాట్లాడటం సరిగ్గా అనిపించలేదు. అతడు లేవనెత్తిన పాయింట్ కరెక్టే కానీ.. చెప్పే విధానమే సరిగ్గా లేదు.

నామినేషన్‌లో 9 మంది..

బిగ్‌బాస్ హౌస్ నియమాలను పాటించాలి అని చెప్పిన గీతూ.. జోకర్ టాస్క్‌లో మాత్రం పాటించలేదని నీ మాటలపై నువ్వే స్టాండ్ తీసుకోలేదని రాజ్.. ఆమెను నామినేట్ చేస్తాడు. అయితే అతడి నామినేషన్‌ను గీతూ అస్సలు తీసుకోలేకపోయింది. నన్ను తుప్పాస్ రీజన్స్‌తో నామినేట్ చేశావు.. ఈ హౌస్‌లో అందరికంటే వీక్ నువ్వే.. ఒక్కశాతం కూడా ఎంటర్టైన్ చేయడం లేదని అంటూ రాజ్‌పై విరుచుకుపడింది. అతడితో పాటు కీర్తిని నామినేట్ చేసింది. అనంతరం శ్రీసత్య.. కీర్తిని నామినేట్ చేస్తూ.. బూతులు మాట్లాడుతున్నావంటూ కీర్తిని, ఎంటర్టైన్మెంట్ తక్కువైందని ఆదిని నామినేట్ చేసింది. అయితే ఈ సారి ఎక్కువ నామినేషన్లు.. కీర్తి, ఆదికి పడ్డాయి. చంటి తనవల్లే బయటకు వెళ్లాడని కీర్తిని, ఎంటర్టైన్మెంట్ చేయడం లేదని ఆదిని నామినేట్ చేశారు. ఫైనల్‌గా ఈ వారం 9 మంది నామినేషన్‌లో ఉన్నారు. కీర్తి, ఆదిరెడ్డి, గీతూ, ఆదిరెడ్డి, సుదీప, శ్రీహాన్, రాజ్, శ్రీసత్య, మెరీనా నామినేట్ అయ్యారు.

Whats_app_banner

సంబంధిత కథనం