Bigg Boss 6 Telugu Episode 26: బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా కీర్తి - రేవంత్‌కు ఆదిరెడ్డి వార్నింగ్‌-bigg boss 6 telugu episode 26 highlights keerthi becomes new captain of the bigg boss house ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bigg Boss 6 Telugu Episode 26 Highlights Keerthi Becomes New Captain Of The Bigg Boss House

Bigg Boss 6 Telugu Episode 26: బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా కీర్తి - రేవంత్‌కు ఆదిరెడ్డి వార్నింగ్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 01, 2022 08:17 AM IST

Bigg Boss 6 Telugu Episode 26:నిద్ర‌పోయినందుకు ఇచ్చిన ప‌నిష్‌మెంట్ విష‌యంలో కెప్టెన్ ఆదిరెడ్డితో రేవంత్ గొడ‌వ‌ప‌డ్డారు. కెప్టెన్సీ రేసు నుంచి త‌న‌ను త‌ప్పించ‌డంతో ఆరోహి ఎమోష‌న‌ల్ అయ్యి క‌న్నీళ్లు పెట్టుకున్న‌ది. కెప్టెన్సీ టాస్క్ మొద‌టి లెవ‌ల్ పూర్త‌య్యే స‌మ‌యానికి కీర్తి, సుదీప‌, శ్రీస‌త్య రేసులో మిగిలిపోయారు.

కీర్తి
కీర్తి (Twitter)

Bigg Boss 6 Telugu Episode 26: బిగ్‌బాస్ 26వ రోజు కంటెస్టెంట్స్ డబుల్ గేమ్ లతో తో ఆస‌క్తిక‌రంగా సాగింది. మిగిలిన వాళ్ల‌కు ఎవ‌రికి థ్రెట్ లేదు...నిన్ను కొట్టాల‌నే ప‌గ‌తో తెగ ఎదురుచూస్తున్నారు. జాగ్ర‌త్త‌గా ఉండాలిరా మ‌రి అంటూ త‌న‌కే తానే ధైర్యం చెప్పుకుంటూ శ్రీహాన్ క‌నిపించాడు. శ్రీస‌త్య ఫొటో ముందు నిల‌బ‌డి ఆమెను వెక్కిరిస్తూ క‌నిపించాడు. నేను బాగా ఇంప్రూవ్ అయ్యాను, డ్యాన్స్ బాగా చేస్తానంటూ ఆమె డైలాగ్‌ను ఇమిటేట్ చేశాడు. నేను ఆడ‌లేద‌ని మీరు ఎలా అంటారండి...గ్లామ్ ప్యార‌డైజ్‌లో అన్ని చేశాను అంటూ ఇనాయా చెప్పిన డైలాగ్ ను కూడా ఇమిటేట్ చేశాడు.

రేవంత్ డబుల్ యాక్షన్…

రేవంత్ డ‌బుల్ యాక్ష‌న్ చూడ‌లేక చ‌చ్చిపోతున్నానంటూ సుదీప‌తో శ్రీస‌త్య చెబుతూ క‌నిపించింది. రేవంత్ ప‌డుకున్నందుకు అత‌డికి ఓ ప‌నిష్‌మెంట్ ఇచ్చాడు కెప్టెన్ ఆదిరెడ్డి. త‌న‌కే ప‌దే ప‌దే ప‌నులు చెప్ప‌డం బాగాలేదంటూ మిగిలిన వాళ్లు ఖాళీగా కూర్చొంటున్నా వారికి ఎలాంటి పనులు చెప్పడం లేదని రేవంత్ అన్నాడు. ఈ విష‌యంలో ఆదిరెడ్డి, రేవంత్ గొడ‌వ‌ప‌డ్డారు. ప్ర‌తి విష‌యంలో రేవంత్ ఆర్గ్యూమెంట్ చేయ‌డం బాగాలేదంటూ ఆదిరెడ్డి అన్నాడు.

కెప్టెన్ చెబితే చేయాల్సిందే…

కెప్టెన్ ఏది చెబితే అది నోరు మూసుకొని చేయాల్సిందే అంటూ రేవంత్ క వార్నింగ్ ఇచ్చాడు. . ప్ర‌తిసారి మాట‌లు మార్చుతూ మాట్లాడటం రేవంత్ కు అలవాటు గా మారిందని ఆదిరెడ్డి సీరియ‌స్ అయ్యాడు. మిగిలిన వాళ్లు నిద్ర‌పోయిన‌ప్పుడు చూసుకోకుండా త‌న‌ను మాత్ర‌మే టార్గెట్ చేయ‌డం బాగాలేద‌ని రేవంత్ అతడితో అన్నాడు. ఫైమాను స‌ర‌దాగా కొట్ట‌డానికి రాజ్ వ‌చ్చాడు. త‌న‌పై చేయివేసినందుకు పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ ఫైమా అత‌డిని ఏడిపించింది. నిన్న న‌డుము కూడా గిల్లాడంటూ చెప్పింది. ఆమె ర్యాగింగ్ కు భ‌య‌ప‌డి రాజ‌శేఖ‌ర్ పారిపోయాడు.

శ్రీహాన్ ఔట్…

పంచ్ ప‌డుద్ది టాస్క్ తిరిగి మొద‌ల‌వుతుంద‌ని బిగ్‌బాస్ ప్ర‌క‌టించాడు. ఇనాయా గ్లౌజ్ అందుకున్న‌ది. మీరు ఎందుకు కెప్టెన్ అవ్వాల‌నుకుంటున్నారు, మిమ్మ‌ల్ని నేను ఎందుకు కొట్ట‌కూడ‌దో చెప్పాలంటూ కెప్టెన్సీ రేసులో ఉన్న ఆరుగురిని కొరింది. ఇంట్లో కి వ‌చ్చిన మొద‌టి రోజు నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అంద‌రితో తాను కలివిడిగా ఉన్నానని, , కెప్టెన్ ఆదేశాల‌ను పాటిస్తున్న తీరు న‌చ్చితే త‌న‌ను సేవ్ చేయ‌మ‌ని శ్రీహాన్ చెప్పాడు. అంద‌రిని ఈక్వ‌ల్‌గా చూస్తాన‌ని శ్రీస‌త్య తెలిపింది.

హౌజ్‌లో త‌న‌కు ఎవ‌రితో ఎలాంటి ఇష్యూ లేద‌ని రోహిత్ అన్నాడు. ప్ర‌తి విష‌యంలో తాను స్ట్రెయిట్ ఫార్వ‌ర్డ్‌గా ఉన్నాన‌ని ఆరోహి చెప్పింది. నిజాయితీగా ఉన్నాన‌ని, ఫేవ‌రిజం త‌న‌లో ఉండ‌ద‌ని కెప్టెన్ కావాల్సిన అన్ని క్వాలిటీస్ త‌న‌లో ఉన్నాయ‌ని కీర్తి పేర్కొన్న‌ది. తొలుత శ్రీహాన్ ఫొటోపై పంచ్ ఇచ్చింది ఇనాయా. అమ్మాయి కెప్టెన్ కావాలన్నదే త‌న అభిమ‌త‌మ‌ని చెప్పింది. ఆమె చెప్పిన రీజ‌న్‌తో శ్రీహాన్ క‌న్వీన్స్ అయ్యాడు. కెప్టెన్సీ రేసు నుంచి త‌ప్పుకున్నాడు.

కన్నీళ్లు పెట్టుకున్న సూర్య

ఆ త‌ర్వాత బాలాదిత్య గ్లోవ్స్ అందుకున్నాడు. కానీ అప్ప‌టికే అత‌డు త‌న అవ‌కాశాన్ని యూజ్ చేసుకోవ‌డంతో గ్లోవ్స్ ప‌క్క‌న‌పెట్టారు. శ్రీహాన్ గ్లోవ్స్ అందుకున్నాడు. రావ‌డంతోనే రోహిత్ ఫొటోపై పంచ్ ఇచ్చాడు. అంద‌రితో ఇంట‌రాక్ష‌న్‌, ఎవ‌రితో ఎలా ప‌నిచేయాలో ముఖ్యం అని అందుకే రోహిత్‌ను రేసు నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు శ్రీహాన్ చెప్పాడు.

చివ‌ర‌గా రేసులో కీర్తి, ఆరోహి, శ్రీస‌త్య‌, సుదీప మిగిలిపోయారు. సూర్య ఏడుస్తూ కనిపించాడు. అమ్మ గుర్తొచ్చి ఏడుస్తున్న అతడిని ఆరోహి ఓదర్చుతూ కనిపించింది. ఆ తర్వాత గ్లోవ్స్ అందుకున్న అర్జున్ కళ్యాణ్ ఆరోహి ఫోటో పైపంచ్ వేశాడు. కంటెస్టెంట్స్ తో ఆమె మాట్లాడే తీరు బాగాలేదని అర్జున్ కళ్యాణ్ అన్నాడు. అర్జున్ కళ్యాణ్ మాటలతో ఆరోహి ఎమోషనల్ అయ్యింది. కెప్టెన్సీ టాస్క్ మొద‌టి లెవ‌ల్ పూర్త‌య్యే స‌మ‌యానికి కీర్తి, సుదీప‌, శ్రీస‌త్య రేసులో మిగిలిపోయారు.రెండో లెవల్ లో బ్లాక్ బాస్టర్ కెప్టెన్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో గెలిచిన కీర్తి కొత్త కెప్టెన్ గా ఎంపికైంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.