Copy Rights Accusation on Kantara: వరాహ రూపం సాంగ్ ఆ పాట నుంచి కాపీనా? చిక్కుల్లో కాంతార టీమ్-thaikkudam bridge made accusations on kantara movie team for varaha roopam copied from us ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Copy Rights Accusation On Kantara: వరాహ రూపం సాంగ్ ఆ పాట నుంచి కాపీనా? చిక్కుల్లో కాంతార టీమ్

Copy Rights Accusation on Kantara: వరాహ రూపం సాంగ్ ఆ పాట నుంచి కాపీనా? చిక్కుల్లో కాంతార టీమ్

Maragani Govardhan HT Telugu
Oct 25, 2022 04:54 PM IST

Copy Rights Accusation on Kantara: రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం కాంతార. ఈ సినిమాలోని వరాహ రూపం సాంగ్‌ను తమ పాట నుంచి కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన మ్యూజిక్ బ్యాండ్ తైక్కూడం బ్రిడ్జ్ ఆరోపించింది.

కాంతార టీమ్ కు లీగల్ నోటీసులు
కాంతార టీమ్ కు లీగల్ నోటీసులు

Copy Rights Accusation on Kantara: ప్రస్తుతం ఎక్కడా చూసిన కాంతార గురించే చర్చ నడుస్తోంది. ఐఎండీబీ రేటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన భారతీయ చిత్రంగా ఈ సినిమా గుర్తింపు తెచ్చుకుంది. 16 కోట్లతో తెరక్కించిన ఈ సినిమా దాదాపు రూ.200 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం కన్నడలోనే కాకుండా తెలుగులోనూ కాసుల వర్షాన్ని కురిపిస్తోంది కాంతార. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తోంది. తాజాగా ఈ సినిమా న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుంది.

కథ పరంగానే కాకుండా పాటలకు కూడా కాంతార మంచి ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా వరాహ రూపం.. దైవ వరిష్ఠం అంటూ సాగే పాట శ్రోతలను అలరించింది. అయితే ఈ పాట తమ బాణి నుంచి కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన తైక్కుడం బ్రిజ్డ్ అనే మ్యూజీక్ బ్రాండ్ ఆరోపణలు చేసింది. ఈ విషయంలో కాపీ రైట్స్ కింద న్యాయపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేసింది.

"మా బ్యాండ్, మా భాగస్వాముల ప్రకారం తైక్కుడం బ్రిడ్జ్‌కు కాంతారకు ఎలాంటి ఒప్పందం లేదని శ్రోతలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ఆడియో పరంగా మా నవరసం, వరాహ రూపం మధ్య సారూప్యతలు చాలా ఉన్నాయి. కచ్చితంగా ఇది కాపీ రైట్ చట్టాలను ఉల్లంఘించడమే. మా దృక్కోణం నుంచి ప్లాజియరైజ్డ్ మధ్య ఈ రేఖ విభిన్నమైంది. అందువల్ల ఇందుకు కారణమైన సృజనాత్మక బృందంపై చట్టపరమైన చర్యను కోరతాం. మా నుంచి ఎలాంటి అంగీకారం లేకుండానే.. సినిమా క్రియేటివ్ టీమ్ తమ సొంత పాటగా ప్రచారం చేసుకుంటున్నారు." అని తైక్కుడం బ్రిడ్జ్ అనే బ్యాండ్ ఆరోపించింది.

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించారు. కేజీఎఫ్ లాంటి అద్భుత సినిమాను రూపొందించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. విజయ్ కిరంగదూర్ నిర్మాతగా వ్యవహరించారు. రిషభ్ శెట్టితో పాటు కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమి గౌడ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజనీశ్ లోక్‌నాథ్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో అక్టోబరు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Thaikkudam Bridge accused the Kantara makers of copying its song in an Instagram post.
Thaikkudam Bridge accused the Kantara makers of copying its song in an Instagram post.
Whats_app_banner

సంబంధిత కథనం