Taapsee Pannu | బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లిపై ఓపెన్ అయిన తాప్సీ
డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథిస్ బోయే తో లవ్ లైఫ్ పరిపూర్ణంగా ఆస్వాదిస్తోంది తాప్సీ. ఈ జంట త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథిస్ బోయేతో చాలా కాలంగా ప్రేమాయణాన్ని కొనసాగిస్తోంది పంజాబీ సుందరి తాప్పీ. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ సమయంలో మాథిస్‌తో తాప్సీకి పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే ఆ స్నేహం ప్రేమగా మారినట్లు సమాచారం. అయితే తమ ప్రేమవ్యవహారాన్ని చాలా గోప్యంగా ఉంచుతోంది ఈ జంట. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడం అరుదనే చెప్పాలి. అందుకు గల కారణాల్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ వెల్లడించింది.
పర్సనల్ లైఫ్‌కు సంబంధించి విషయాల్ని రహస్యంగానే ఉంచడానికి తాను ఇష్టపడతానని అంటోంది తాప్సీ. వ్యక్తిగత జీవితాన్ని వృత్తితో ముడిపెట్టి చూడటం తనకు నచ్చదని అంటోంది. ‘ఇండస్ట్రీలోని వారిని ప్రేమించకూడదని అనుకున్నా. నా ఆలోచనలకు తగినట్లుగానే సినీ పరిశ్రమతో సంబంధంలేని వ్యక్తి నా జీవితంలోని రావడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది. తమ ఆలోచన ధోరణులు, అభిప్రాయాల్లో చాలా భేదాలున్నాయని, ఒకరి సంస్కృతుల్ని, సంప్రదాయాల్ని మరొకరం గౌరవిస్తూ జీవితంలో ముందుకు సాగుతున్నామని చెప్పింది.
పెళ్లి వేడుకను సింపుల్‌గా జరుపుకోవాలన్నది తన ఆలోచన అని పేర్కొన్నది తాప్సీ. సినిమాల్లో మాదిరిగా సెంటిమెంట్ డ్రామాలకు తావు లేకుండా ఒక్క రోజులోనే పెళ్లి వేడుక మొత్తం పూర్తవ్వాలని చెప్పింది. పెళ్లిలో ఎక్కువ మేకప్‌కు ప్రాధాన్యమివ్వకుండా నాచురల్‌గానే కనిపించడానికే తాను ఇష్టపడతానని అంటోంది. అయితే పెళ్లి ఎప్పుడనేది మాత్రం తాప్పీ వెల్లడించలేదు.
సంబంధిత కథనం