Hit 2 Pre Release Event: 2 నెలల తర్వాత తెలుగు మాట్లాడుతుంటే హాయిగా ఉంది.. హిట్ 2 వేడుకలో రాజమౌళి వ్యాఖ్యలు-ss rajamouli speech at hit 2 pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ss Rajamouli Speech At Hit 2 Pre Release Event

Hit 2 Pre Release Event: 2 నెలల తర్వాత తెలుగు మాట్లాడుతుంటే హాయిగా ఉంది.. హిట్ 2 వేడుకలో రాజమౌళి వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Nov 29, 2022 09:40 AM IST

Hit 2 Pre Release Event: హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి వచ్చారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి విషెస్ తెలిపారు. నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం డిసెంబరు 2న విడుదల కానుంది.

హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్
హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్

Hit 2 Pre Release Event: నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం హిట్: ది సెకండ్ కేస్. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాను డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాట ప్రేక్షకులను మెప్పించడంతో అంచనాలు భారీగా ఎర్పడ్డాయి. సోమవారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి విచ్చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్ల కోసం విదేశాలకు వెళ్లిన ఆయన ఆదివారమే ఇక్కడకు వచ్చారు. వచ్చిరావడంతోనే హిట్ 2 ఈవెంట్‌కు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని నేచురల్ స్టార్ నాని అన్నారు.

"హిట్ ఫ్రాంఛైజీలో 3,4,5.. ఇలా 7 భాగాలు వస్తాయి. చివరి పార్ట్‌లో అందరి హీరోలను కలుపుతానని, ఓ పెద్ద సమస్య పరిష్కారం కోసం వాళ్లని తీసుకొస్తానని శైలేష్ చెప్పాడు. నిర్మాతగా కంటే ప్రేక్షకునిగా ఆ మూవీ చూసేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన రాజమౌళి గారికి థ్యాంక్స్. ఆయనను చూస్తుంటే దర్శకుడిగా కంటే హీరోలా ఉన్నారు. రెండు నెలల తర్వాత ఇక్కడకు వచ్చిన ఆయన నా మాట మేరకు ఈ వేడుకకు హాజరుకావడం నిజంగా ఆనందంగా ఉంది" అని నాని తెలిపారు.

అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. "రెండు నెలల నుంచి ఇంగ్లీష్ మాట్లాడి ఇప్పుడు తెలుగులో మాట్లాడుతుంటే హాయిగా ఉంది. హిట్ అనే అద్భుతమైన ఫ్రాంఛైజీని సృష్టించిన నాని, ప్రశాంతి, శైలేష్‌ను అభినందిస్తున్నాను. థ్రిల్లర్ జోనర్‌లో శైలేష్ బాగా తీశాడు. ఈ చిత్రం హిట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హిట్ నుంచి 3, 4, 5 సినిమాలు వస్తాయని తెలుసు, అయితే ప్రతి ఏడాది ఒక సీజన్‌లో హిట్ ఫ్రాంఛైజీ రావాలి. ఈ సీజన్‌ హిట్‌ది అని జనాలకు అర్థం కావాలి. ప్రతి ఏడాది ఒకే ఒకే తేదీ లేదా వారంలో విడుదలవుతుండాలి. ఈ సినిమా సక్సెస్ అవుతుందని కచ్చితంగా చెబుతున్నాను. ఈ సందర్భంగా శైలేష్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను." అంటూ రాజమౌళి తన ప్రసంగాన్ని ముగించారు.

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా పనిచేస్తుండగా.. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్