Singer Chinmayi on Female Virginity: టైట్‌గా లేనంత మాత్రాన వర్జిన్ కానట్లు కాదు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్-singer chinmayi sripaada about female virginity and myths on first sexual experience ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Singer Chinmayi On Female Virginity: టైట్‌గా లేనంత మాత్రాన వర్జిన్ కానట్లు కాదు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్

Singer Chinmayi on Female Virginity: టైట్‌గా లేనంత మాత్రాన వర్జిన్ కానట్లు కాదు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్

Maragani Govardhan HT Telugu
Mar 17, 2023 07:05 PM IST

Singer Chinmayi on Female Virginity: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మహిళల వర్జినిటీ, తొలి కలయిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలయిక సమయంలో యోనీ టైట్‌గా లేనంత మాత్రాన వర్జిన్ కానట్లు కాదని స్పష్టం చేసింది.

చిన్మయి శ్రీపాద
చిన్మయి శ్రీపాద

Singer Chinmayi on Female Virginity:ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద పాటలతోనే కాదు మాటలతోనూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. తనకు తాను స్ట్రాంగ్ ఫెమినిస్టుగా చెప్పుకునే ఈ గాయని.. మహిళల ఎదుర్కొనే ఇబ్బందులు, శృంగారం లాంటి సున్నితమైన విషయాల గురించి నిర్మహొహమాటంగా స్పందిస్తుంటారు. వారి వ్యక్తిగత విషయాలపై బహిరంగంగా మాట్లాడటమే కాకుండా.. ధైర్యంగా వారి సమస్యలపై తన గొంతుకను వినిపిస్తుంటారు. తాజాగా మహిళల తొలి కలయిక సమయంలో అబ్బాయిల్లో ఉండే అపోహలు, అభ్యంతరాలపై స్పందించింది. తొలి కలయిక స్త్రీ యోని టైట్‌గా లేనంత మాత్రాన ఆమె వర్జిన్ కానట్లు కాదని స్పష్టం చేసింది.

ఇందుకు సంబంధించి పూర్తి వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది చిన్మయి. వీడియోను గమనిస్తే.. కొత్తగా పెళ్లయిన వధువు అంచనాలు ఈ విధంగా ఉంటాయని ఇరుకు సందులో కారు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. కానీ రియాల్టీ ఇలా ఉంటుందని యోనీ లూజ్‌గా ఉంటుందని అర్థం వచ్చేలా సోదాహరణంగా కారు దూరంగా వెళ్తున్నట్లు చూపిస్తారు. ఇది చూసిన సింగర్ చిన్మయి మహిళల వర్జినిటీ గురించి క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు.

"అమ్మాయిలకు తొలి కలయికలో నొప్పి ఉంటుందని, రక్తం వస్తేనో, టైట్‌గా ఉంటేనో వర్జిన్ అని చాలామంది అపోహ పడుతుంటారు. అవన్నీ పచ్చి అబద్ధాలు. నిజానికి తొలి కలయిక సమయంలో అమ్మాయిలకు మరింత ఎక్కువగా బాధ, నొప్పి వస్తుందంటే అది వైద్యపరంగా చాలా పెద్ద సమస్యని తెలుసుకోవాలి. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి." అని చిన్మయి స్పష్టం చేసింది.

అంతేకాకుండా ఇలాంటి విషయాలను బయట చర్చించడానికి సిగ్గుపడొద్దని, కానీ ఇప్పటి సమాజం అలానే వ్యవహరిస్తుందని ఈ సింగర్ చెప్పుకొచ్చింది. ఇలాంటి విషయాలు ఇలా బహిరంగంగా మాట్లాడతారా? అంటూ మనల్నే తక్కువ చేసి చూస్తారని స్పష్టం చేసింది. తొలి కలయిక విషయంలో అబ్బాయిలు వేసే ట్రోల్స్, జోకులు, మీమ్స్‌లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ వట్టి అపోహలు మాత్రమేనని కొట్టి పారేసింది.

ప్రస్తుతం చిన్నయి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు. చాలా మంది వీడియోపై సానుకూలంగా స్పందిస్తున్నారు. మీలాగా ధైర్యంగా అందరూ ఇలాంటి విషయాల గురించి అవగాహన తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ తరం వారికి మంచి సమాచారమిచ్చారని ఆమెను ప్రశంసిస్తున్నారు.

Whats_app_banner