Sharwanand Birthday: శర్వా పుట్టినరోజున అదిరేపోయే అప్డేట్.. అతడి 35వ సినిమా పోస్టర్ విడుదల-sharwanand new movie sharwa 35 poster released on his birthday
Telugu News  /  Entertainment  /  Sharwanand New Movie Sharwa 35 Poster Released On His Birthday
శర్వానంద్ 35వ సినిమా పోస్టర్
శర్వానంద్ 35వ సినిమా పోస్టర్

Sharwanand Birthday: శర్వా పుట్టినరోజున అదిరేపోయే అప్డేట్.. అతడి 35వ సినిమా పోస్టర్ విడుదల

06 March 2023, 9:57 ISTMaragani Govardhan
06 March 2023, 9:57 IST

Sharwanand Birthday: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అతడి నటిస్తున్న తదుపరి చిత్రం శర్వా 35 పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు.

Sharwanand Birthday: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గతేడాది ఒకే ఒక జీవితం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం నిలిచింది. ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకున్న శర్వా కెరీర్ పరంగా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఒకే ఒక జీవితం తర్వాత ఇంతవరకు సినిమా ఎనౌన్స్ చేయని శర్వా.. త్వరలో సరికొత్త మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సోమవారం నాడు శర్వా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.

ఇది శర్వానంద్ నటిస్తున్న 35వ సినిమా కావడం విశేషం. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమింగ్ ఆఫ్ ఏజ్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రత్యేకమైన కథ, కథానాలతో రూపొందుతుంది. ఇందులో శర్వా క్యారెక్టర్ క్రేజీగా ఉండబోతుందని సమాచారం.

విడుదలైన పోస్టర్‌ను బట్టి చూస్తుంటే శర్వా రిచ్ కిడ్‌గా కనిపిస్తున్నాడు. అతడి డ్రెస్సింగ్ స్టైల్, మేనరిజం చూస్తుంటే ఇది తెలుస్తోంది. అతడి యాటిట్యూడ్, చిన్న గడ్డంతో శర్వా వైవిధ్యంగా దర్శనమివ్వనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది గురించి మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.

టాపిక్