Sharwanand: త్రివిక్రమ్ క్లాప్‌తో మొదలైన శర్వానంద్ 33వ సినిమా
Sharwanand:శర్వానంద్ హీరోగా నటిస్తున్న33వ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరంటే...
Sharwanand: ఫ్యామిలీ కథాంశాలతో పాటు ప్రయోగాలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తుంటాడు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్. అతడు హీరోగా నటిస్తున్నకొత్త చిత్రం గురువారం ప్రారంభమైంది. ఈ సినిమాకు రౌడీఫెల్లో ఫేమ్ కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శర్వానంద్,రాశీఖన్నాపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చాడు.
పొలిటికల్ యాక్షన్ డ్రామా కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో నటించనున్నది. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇందులో శర్వానంద్ ఓ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించబోతున్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. శర్వానంద్ కెరీర్ లో33వ సినిమా ఇది. కాగా శర్వానంద్ హీరోగా నటిస్తున్నఒకే ఒక జీవితం సినిమా సెప్టెంబర్9న తెలుగు,తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.