BOLLYWOOD | ఒకే ఫ్రేమ్‌లో షారుఖ్‌, స‌ల్మాన్‌, అక్ష‌య్‌-shahrukh khan salman khan and akshay kumar meet saudi arabia cultural minister ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shahrukh Khan Salman Khan And Akshay Kumar Meet Saudi Arabia Cultural Minister

BOLLYWOOD | ఒకే ఫ్రేమ్‌లో షారుఖ్‌, స‌ల్మాన్‌, అక్ష‌య్‌

Nelki Naresh HT Telugu
Apr 03, 2022 02:59 PM IST

చాలా రోజుల త‌ర్వాత బాలీవుడ్ అగ్ర కథానాయకులు షారుఖ్‌ఖాన్‌,స‌ల్మాన్‌ఖాన్‌,అక్ష‌య్‌కుమార్‌,సైఫ్ అలీఖాన్ ఒకే చోట క‌నిపించారు. సౌదీ అరేబియా క‌ల్చ‌ర‌ల్ మినిస్ట‌ర్ బాద‌ర్ బిన్ ఫ‌ర్హాన్‌తో ఈ స్టార్ హీరోలు దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి

షారుఖ్‌ఖాన్‌,స‌ల్మాన్‌ఖాన్‌,
షారుఖ్‌ఖాన్‌,స‌ల్మాన్‌ఖాన్‌, (twitter)

బాలీవుడ్ అగ్ర‌హీరోలు షారుఖ్‌ఖాన్, స‌ల్మాన్‌ఖాన్‌,అక్ష‌య్‌కుమార్ ఒకే చోట క‌నిపించ‌డం అరుద‌నే చెప్పాలి. ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించి చాలా కాల‌మైంది. శ‌నివారం ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృత‌మైంది. సౌదీ అరేబియా సాంస్కృతిక శాఖ మంత్రి బాద‌ర్ బిన్ ఫ‌ర్హాన్ అల్హౌద్ ను బాలీవుడ్ స్టార్ హీరోలు క‌లిశారు. ఈ ఫొటోల‌ను మంత్రి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో షారుఖ్‌ఖాన్‌,స‌ల్మాన్‌ఖాన్‌,అక్ష‌య్‌కుమార్‌తో పాటు సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. షారుఖ్‌ఖాన్‌తో సెల్ఫీ దిగిన ఫొటోతో పాటు హీరోలంద‌రితో క‌లిసి ముచ్చ‌టిస్తున్న ఫొటోల‌ను మినిస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

బిన్ ఫ‌ర్హాన్ ముంబైలోని షారుఖ్‌ఖాన్ నివాసానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. అంత‌కుముందు రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ చైర్మ‌న్ మ‌హ‌మ్మ‌ద్ అల్ ట‌ర్కీ కూడా షారుక్‌ఖాన్‌ను క‌లిశారు. షారుఖ్ స్వ‌గృహంలో మ‌న్న‌త్‌తో క‌లిసి దిగిన ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. కల్చరల్ మినిస్టర్ ను కలిసిన ఫొటోతో పాటు మహమ్మద్ అల్ టర్కీ ఫొటోలో షారుఖ్‌ఖాన్ ఒకే ర‌క‌మైన దుస్తుల్లో క‌నిపించ‌డం హాట్‌టాపిక్‌గా మారింది. క‌ల్చ‌ర‌ల్ మినిస్ట‌ర్ తో పాటు మ‌హ‌మ్మ‌ద్ అల్ ట‌ర్కీ క‌లిసే షారుఖ్ నివాసానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. అత‌డిని క‌ల‌వ‌డానికి స‌ల్మాన్‌ఖాన్‌,అక్ష‌య్‌కుమార్‌,సైఫ్ అలీఖాన్ షారుఖ్ ఇంటికి వెళ్లిన‌ట్లు చెబుతున్నారు.

 

IPL_Entry_Point