Samantha | క్యూట్‌లుక్‌లో ప్రెట్టీ వుమన్‌ సమంత.. వీడియో వైరల్‌-samantha looking gorgeous in this latest video she shared on instagram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha | క్యూట్‌లుక్‌లో ప్రెట్టీ వుమన్‌ సమంత.. వీడియో వైరల్‌

Samantha | క్యూట్‌లుక్‌లో ప్రెట్టీ వుమన్‌ సమంత.. వీడియో వైరల్‌

HT Telugu Desk HT Telugu
Apr 24, 2022 06:51 PM IST

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత.. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. క్యూట్‌ లుక్‌లో కనిపిస్తున్న సామ్‌.. ప్రెట్టీ వుమన్‌ పాటకు డ్యాన్స్‌ చేస్తూ కనిపించింది.

<p>సమంత&nbsp;</p>
సమంత (instagram)

ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలుసు. ప్రతి రోజూ ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తూ తన కెరీర్‌, వ్యక్తిగత జీవితంపై అప్‌డేట్‌ ఇస్తూ ఉంటుంది. ఇన్‌స్టా స్టోరీల్లో కోస్టార్స్‌కు బర్త్‌డే విషెస్‌ చెబుతుంటుంది. తాజాగా ఆదివారం కూడా సామ్‌ తన ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. మింత్రా కోసం చేసిన యాడ్‌ షూట్‌కు సంబంధించిన వీడియో అది. బిహైండ్‌ ద సీన్స్‌ అంటూ ఆమె ఈ వీడియోను పోస్ట్‌ చేసింది.

బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రెట్టీ వుమన్‌ పాట వస్తుండగా.. ఎంతో క్యూట్‌ లుక్‌లో సమంత డ్యాన్స్‌ చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది. తొలిసారి సామ్‌ను పింక్‌ హెయిల్‌లో ఈ వీడియోలో చూడొచ్చు. ఫొటో షూట్‌ సందర్భంగా మేకప్‌, హెయిర్‌స్టైల్‌ చేయించుకుంటూ క్యూట్‌ స్మైల్‌ ఇవ్వడం ఈ వీడియోలో చూడొచ్చు. డిఫెరెంట్‌ ఔట్‌ఫిట్‌లో ఆమె చాలా అందంగా కనిపించింది. ఫన్‌ అని రాస్తూ హార్ట్‌ ఎమోజీలను పోస్ట్‌ చేసింది.

ఈ వీడియో పోస్ట్‌ చేసిన వెంటనే లక్షల మంది లైక్‌ చేస్తూ కామెంట్‌ చేశారు. ఆమె తమిళంలో నటించిన కాతు వాకుల రెండు కాదల్‌ అనే మూవీ ఈ నెల 28న రిలీజ్‌ కాబోతోంది. విజయ్‌ సేతుపతి ఈ మూవీలో లీడ్‌ రోల్‌లో కనిపిస్తుండగా.. నయనతార కూడా నటించింది. విగ్నేష్‌ శివన్‌ ఈ మూవీకి డైరెక్టర్‌. ఆమె త్వరలోనే విజయ్‌ దేవరకొండతోనూ ఓ మూవీ చేస్తోంది. యశోద, శాకుంతలంలాంటి మూవీస్‌ కూడా రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం