Sam Bahadur OTT Release Date: సామ్ బహదూర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. విక్కీ కౌశల్ వార్ డ్రామా ఎక్కడ చూడాలంటే?-sam bahadur ott release date vicky kaushal movie to stream in zee 5 ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sam Bahadur Ott Release Date: సామ్ బహదూర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. విక్కీ కౌశల్ వార్ డ్రామా ఎక్కడ చూడాలంటే?

Sam Bahadur OTT Release Date: సామ్ బహదూర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. విక్కీ కౌశల్ వార్ డ్రామా ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Dec 08, 2023 09:15 AM IST

Sam Bahadur OTT Release Date: బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన సామ్ బహదూర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

సామ్ బహదూర్ మూవీలో విక్కీ కౌశల్
సామ్ బహదూర్ మూవీలో విక్కీ కౌశల్

Sam Bahadur OTT Release Date: బాలీవుడ్‌లో వరుసగా దేశభక్తి సినిమాలు చేస్తున్న విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ సామ్ బహదూర్. డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా యానిమల్ తో పోటీ పడుతూ కూడా మంచి వసూళ్లే సాధించింది. ఇక ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. సామ్ బహదూర్ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

విక్కీ కౌశల్ నటించిన వార్ డ్రామా సామ్ బహదూర్ కు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటికే ఉరి, సర్దార్ ఉధమ్ లాంటి దేశభక్తి సినిమాలు చేసిన విక్కీ.. ఇప్పుడు సామ్ బహదూర్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. గొప్ప దేశభక్తుడు సామ్ మానిక్‌షా పాత్రలో విక్కీ కనిపించాడు. ఈ సినిమా జీ5 (Zee5 OTT) ఓటీటీలో జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సామ్ బహదూర్ సినిమాను మేఘన గుల్జార్ డైరెక్ట్ చేసింది. నిజానికి థియేటర్లలో రిలీజైన మూడు, నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వస్తుందన్న వార్తలు మొదట్లో వచ్చినా.. మేకర్స్ మాత్రం జనవరి 26న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో మానిక్‌షా పాత్రలో విక్కీ కౌశల్ నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి.

ఎవరీ సామ్ మానిక్‌షా?

సామ్ మానిక్‌షా భారతదేశ తొలి ఫీల్డ్ మార్షల్. 1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ గా ఉన్నారు. దేశంలో ఫీల్డ్ మార్షల్ గా ప్రమోషన్ పొందిన తొలి ఆర్మీ అధికారి సామ్ మానిక్‌షా. రెండో ప్రపంచ యుద్ధకాలం నుంచి మానిక్‌షా ఆర్మీలోనే ఉన్నారు. ఐదు యుద్ధాల్లో తన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. 2008లో 94 ఏళ్ల వయసులో కన్ను మూశారు.

IPL_Entry_Point